'స్వయంకృషి'తో ఎదిగి తన యాక్షన్, డ్యాన్స్‌లతో ఎందరిలోనో స్ఫూర్తినింపిన 'ఆచార్యు'డు. కామెడీ, ఎమోషన్.. ఇలా నవరసాలన్నింటిలో 'మాస్టర్' అనిపించుకున్నారు. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. స్టార్‌గానే కాకుండా సామాజిక సేవతోనూ 'అందరివాడు' అనిపించుకున్న ఆయన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే చిరు కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేశారు. ఆ సమయంలో సూపర్ స్టార్ కృష్ణ చిరంజీవిని ఎంతగానో ప్రోత్సహించారు.
వారిద్దరి కాంబినేషన్లో కొత్తల్లుడు, కొత్త పేట రౌడీ లాంటి సినిమాలు వచ్చాయి. అయితే ఇందులో చిరు చిన్న పాత్రలే చేశారు. ఆ తర్వాత 1980లో వీరిద్దరి కాంబినేషన్లో మల్టీస్టారర్‌గా తోడుదొంగలు వచ్చి ఆకట్టుకుంది. ఆ తర్వాత చిరు కెరీర్లో బిజీ అయిపోయారు. చాలా హిట్ సినిమాల్లో నటించారు. అందులో కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన 'స్నేహం కోసం' ఒకటి. మీనా హీరోయిన్. విజయ్ కుమార్, సుజాత, ప్రకాష్ రాజ్, కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం, నిర్మలమ్మ ప్రధాన పాత్రలు పోషించారు.
అయితే ఈ సినిమాలో ముఖ్య పాత్ర కోసం మొదటిగా సూపర్ స్టార్ కృష్ణను తీసుకోవాలని నిర్మాతలు భావించారట. స్నేహంకోసం సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయంలో కనిపించారు. తండ్రి చిరంజీవి పక్కన నటించే స్నేహితుడుగా కృష్ణను తీసుకోవాలనుకున్నారట. కానీ ఆ పాత్రలో నటిస్తే అభిమానులు హర్ట్ అవుతారని భావించిన కృష్ణ.. సున్నితంగా తిరస్కరించారని అప్పట్లో కథనాలు వచ్చాయి. రాజశేఖర్ పాత్ర కూడా పరిశీనలోకి వచ్చిందట. కానీ ఆ తర్వాత చిరంజీవి స్నేహితుడు పాత్రలో నటుడు విజయ్ కుమార్ ఫైనల్ అయ్యారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు మధ్య స్నేహం ఎలా ఉంటుందో అనే కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇదీ చూడండి: ఈ సీరియల్ నటి క్యూట్ అందాలకు ఫిదా అవ్వాల్సిందే