ETV Bharat / entertainment

ఒకే సినిమాతో షారుక్​, బిగ్​బీ, శ్రీదేవీ వారసులు ఎంట్రీ.. టీజర్​ రిలీజ్​ - ఖుషీకపూర్ ఎంట్రీ

Suhanakhan Kushikapoor movie debut: బాలీవుడ్​ బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​ మనవడు అగస్త్య నంద, సూపర్​స్టార్​ షారుక్​ ఖాన్ కూతురు సుహానా ఖాన్​​, ప్రముఖ నిర్మాత బోణీకపూర్​ చిన్న కూతురు ఖుషీ కపూర్​ వెండితెర అరంగేట్రం చేయడానికి సిద్ధమైపోయారు. ఈ ముగ్గురు కలిసి ఒకే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి? దాన్ని తెరకెక్కించే దర్శకుడు ఎవరు? తెలుసుకుందాం..

Suhana Khan, Khushi Kapoor and Agastya Nanda
ఒకే సినిమాతో ముగ్గురు స్టార్​ వారసులు ఎంట్రీ.. టీజర్​ రిలీజ్​
author img

By

Published : May 14, 2022, 12:35 PM IST

Suhanakhan Kushikapoor movie debut: బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్, బాలీవుడ్​ బాద్​ షా షారుక్​ ఖాన్​, ​అందాల తార దివంగత నటి శ్రీదేవి అభిమానులకు తీపికబురు అందించారు ప్రముఖ దర్శకురాలు జోయా అక్తర్. ఈ ముగ్గురి వారసులను ఒకే సినిమాతో వెండితెరకు పరిచయం చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.

బిగ్​బీ మనవడు అగస్త్య నంద, బాద్​షా కుమార్తె సుహానా ఖాన్, శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్​.. జోయా అక్తర్ దర్శకత్వంలో వెండితెరకు పరిచయం చేయనున్నారని గతకొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడా ప్రచారన్ని నిజం చేస్తూ సోషల్​మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు జోయా. సినిమాకు 'ది ఆర్చీస్'​ అనే టైటిల్​ ఖరారు చేసి ఫస్ట్​లుక్​ పోస్టర్​, టీజర్​ను విడుదల చేశారు. 2023లో నెట్​ఫ్లిక్స్​లో ఇది విడుదలవుతుందని చెప్పారు. 1960లో సాగే లైవ్​-యాక్షన్​ మ్యూజికల్​ ఫిల్మ్​ అని తెలిపారు. ఇవి చూసిన అభిమానులు.. తమ అభిమాన నటుల వారసులు త్వరలోనే వెండితెరకు పరిచయం కాబోతుండటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: అందాల నటి, ఎంపీ 'నుస్రత్​ జహాన్​​' ప్రేమ కథలో ఎన్ని ట్విస్టులో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.