Sriya Reddy Salaar Movie : రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో 'కేజీఎఫ్' ఫేమ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'సలార్'. పాన్ వరల్డ్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం మంచి టాక్‌తో పాటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
అయితే ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎంత ఫేమస్ అయ్యిందో అదే రేంజ్లో మరికొంత మంది పాపులరై లైమ్‌లైట్‌లోకి వచ్చారు. అందులో 'పొగరు' ఫేమ్ కోలీవుడ్ బ్యూటీ శ్రియా రెడ్డి ఒకరు. ఇందులో ఆమె రాధారమ అనే క్యారెక్టర్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
-
When #RadhaRama takes a break! pic.twitter.com/oZl1csGick
— Sriya Reddy (@sriyareddy) December 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">When #RadhaRama takes a break! pic.twitter.com/oZl1csGick
— Sriya Reddy (@sriyareddy) December 26, 2023When #RadhaRama takes a break! pic.twitter.com/oZl1csGick
— Sriya Reddy (@sriyareddy) December 26, 2023
తన నటనతో అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్లో పాపులరైన శ్రియా కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి తాజాగా తన సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. అలా 'సలార్'తో పాటు పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమాల్లో అవకాశం అందుకున్నారు. తాజాగా 'సలార్'లో ఆమె నటనకు ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆమె సినిమా గురించి ముచ్చటించారు. పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
-
Thank you to the amazing costume team …. ! #radharama #Salaar pic.twitter.com/76uO08PvEd
— Sriya Reddy (@sriyareddy) December 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thank you to the amazing costume team …. ! #radharama #Salaar pic.twitter.com/76uO08PvEd
— Sriya Reddy (@sriyareddy) December 23, 2023Thank you to the amazing costume team …. ! #radharama #Salaar pic.twitter.com/76uO08PvEd
— Sriya Reddy (@sriyareddy) December 23, 2023
" డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నన్ను కలిసి, ఈ సినిమా గురించి చెప్పినప్పుడు నేను మొదట్లో నటించేందుకు అంగీకరించలేదు. ఎందుకంటే నేను సినిమాలు చేయకూడదంటూ అప్పటికే ఓ నిర్ణయానికి వచ్చాను. కానీ, ఎలాగైనా నా చేత నటింపజేయాలని ప్రశాంత్ పట్టుపట్టారు. దీంతో నన్ను ఒప్పించేందుకు చాలా ప్రయత్నించారు. తొలుత స్క్రిప్టు పూర్తిగా విని ఆ తర్వాత సమాధానాన్ని చెప్పమన్నారు. నాకు ఆ స్టోరీ నచ్చడం వల్ల అందులో నటించేందుకు ఓకే చెప్పాను. స్క్రిప్టులో తొలుత నా పాత్ర ఏమీ లేదు. కథలోకి లోతుగా వెళ్లే క్రమంలో లేడీ విలన్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ తర్వాత ఆ క్యారెక్టర్‌ను రాశారు. అందులో విలనిజాన్ని టచ్ చేస్తూనే ఆ పాత్రను అందంగా చూపించాలనుకున్నారు. 'పొగరు' సినిమాలోని నా యాక్టింగ్ నచ్చడం వల్ల ప్రశాంత్ 'సలార్'లోని రాధారమ పాత్రకు నన్ను ఎంపిక చేసుకున్నారు. ఈ పాత్రకు మంచి పేరు వస్తుందంటూ ప్రశాంత్ నీల్ నాకు అప్పుడే ప్రామిస్ చేశారు. ఎలాంటి సందేహం లేకుండానే సెట్‌కు వచ్చి యాక్ట్ చేయమన్నారు. ఆయనకు తన స్క్రిప్ట్ మీద అంత నమ్మకం. అనుకున్నట్లుగానే నాకు మంచి పేరు వచ్చింది. షూటింగ్ టైమ్‌లో అలా చేయను ఇలా చేయను అని చాలాసార్లు చెప్పాను. కానీ, చివరకు ఓ చిన్న పిల్లలాగా ఆయన నన్ను ఒప్పించేవారు" అంటూ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
-
Just grateful #PrashanthNeel#Salaar #SalaarCeaseFire pic.twitter.com/RRd16VjRQQ
— Sriya Reddy (@sriyareddy) December 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Just grateful #PrashanthNeel#Salaar #SalaarCeaseFire pic.twitter.com/RRd16VjRQQ
— Sriya Reddy (@sriyareddy) December 22, 2023Just grateful #PrashanthNeel#Salaar #SalaarCeaseFire pic.twitter.com/RRd16VjRQQ
— Sriya Reddy (@sriyareddy) December 22, 2023
'ప్రభాస్ సెట్స్‌లో అలా ఉండేవారు - ఆ మాట నేను అస్సలు ఊహించలేదు'
'పవన్ గురించి ఆ విషయం నాకు తెలియదు - అది నేను అసలు ఊహించలేదు'