Samajavaragamana collection : అసలీ 'సామజవరగమన' సినిమా ఎటువంటి బజ్ లేకుండా బాక్సాఫీస్ ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన నిఖిల్ 'స్పై'కి పోటీగా విడుదలైంది. దీంతో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ దక్కలేదు. కానీ మొదటి రోజు 'స్పై' ఊహించి రేంజ్లో డిజాస్టర్ అవ్వడం వల్ల ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది. అలాగే సినిమాలోని కామెడీ కూడా బాగా ప్లస్ అయింది. చిత్ర మౌత్ టాక్ పాజిటివ్‌గా రావడం వల్ల అందరూ ఈ చిత్రంపై ఇంట్రెస్ట్ చూపించడం ప్రారంభించారు. అయితే ఇప్పుడీ చిత్రానికి రెండో వారం కూడా బాగా కలిసొచ్చినట్టుగా తెలుస్తోంది. వీక్ డేస్‌లో కాస్త నెమ్మదించిన ఈ చిత్రం.. ఇప్పుడు వీకెండ్ వచ్చేసరికి మళ్లీ పుంజుకుంది. శుక్రవారం సాయంత్రం సామజవరగమన థియేటర హౌస్ ఫుల్ అయ్యాయట.
ఎందుకంటే శుక్రవారం మీడియం బడ్జెట్ సినిమాలు ఎక్కువగానే విడుదలయ్యాయి. అవన్నీ మొదటి షో నుంచే మంచి టాక్‌ను అందుకోలేకపోయాయి. నాగశౌర్య 'రంగబలి'కి మిశ్రమ స్పందనను అందుకుంది. మరి ఈ చిత్రం ఎంత వరకు హవా కొనసాగిస్తుందో తెలీదు. శ్రీ సింహా 'భాగ్ సాలే' డిజాస్టర్‌గా నిలిచిందని అంటున్నారు. ఈ సినిమా వాషౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.
జగపతిబాబు పీరియాడిక్ డ్రామా రుద్రంగి, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ '7:11 పీఎం', 'సర్కిల్' వంటి సినిమాలను కూడా ఎవరూ పట్టించుకునేలా కనిపించడం లేదు. కాబట్టి ఈ రెండో వారం కూడా సామజవరగమనే హవా అని అర్థమవుతోంది. అంటే ఈ సినిమా.. ఈ రెండో వారంలో మరన్ని వసూళ్లను అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇకపోతే 'సామజవరగమన' సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రంలో శ్రీ విష్ణు హీరోగా నటించారు. రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల, రఘు బాబు, దేవి ప్రసాద్, ప్రియా తదితరులు కీలక పాత్ర పోషించారు. భాను భోగవరపు కథను అందించారు. నందు సవిరిగాన మాటలు ఇచ్చారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. రామ్ రెడ్డి ఛాయాగ్రహణం అందించారు. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండ నిర్మించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి :
'రంగబలి' టు 'భాగ్ సాలే' ఈ వారం సినిమాల ఫైనల్ రివ్యూ.. అదొక్కటే టాప్!
ఊపందుకున్న 'సామజవరగమన'.. ఆ రెండు బాగా కలిసొచ్చాయిగా.. కలెక్షన్స్ డబుల్!