ETV Bharat / entertainment

నేతాజీ మిస్టరీని నిఖిల్​ ఛేదించారా?.. థ్రిల్లింగ్​గా​ 'స్పై' టీజర్​

SPY Movie Telugu : టాలీవుడ్​ హీరో నిఖల్​ నటించిన కొత్త చిత్రం 'స్పై'. పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్​ను సోమవారం దిల్లీ కర్తవ్యపథ్​లో ఉన్న నేతాజీ విగ్రహం వద్ద విడుదల చేసింది చిత్ర బృందం. మీరు చూసేయండి..

spy movie telugu
spy movie telugu
author img

By

Published : May 15, 2023, 8:08 PM IST

Updated : May 15, 2023, 9:27 PM IST

SPY Movie Telugu : కార్తికేయ-2 చిత్రంతో పాన్​ ఇండియా రేంజ్​లో గుర్తింపు సంపాదించారు టాలీవుడ్​ యంగ్​ హీరో నిఖిల్ సిద్ధార్థ​. ఇప్పుడు మరో అడ్వెంచర్​ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డైరెక్టర్​గా పరిచయమవుతున్న ఎడిటర్​ గ్యారీ బీహెచ్​ కాంబోలో 'స్పై' సినిమాలో నటించారు. నిఖిల్​ సరసన ఐశ్వర్య మేనన్‌ కథానాయికగా నటించింది. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం జూన్‌ 29న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా పూర్తి స్థాయి యాక్షన్​ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్​ను చిత్ర యూనిట్..​ దిల్లీలోని కర్తవ్య పథ్‌ వద్ద సోమవారం విడుదల చేసింది.

ఈ 'స్పై' చిత్రాన్ని ఈడీ ఎంటర్​టైన్​మెంట్స్​ పతాకంపై.. చరణ్​ తేజ్​ ఉప్పలపాటి సమర్పణలో కె రాజశేఖర్​ రెడ్డి నిర్మిస్తున్నారు. దీనికి కథ కూడా ఈ సినిమా నిర్మాత అందించడం గమనార్హం. ఈ సినిమాలో ఆర్యన్​ రాజేశ్​, మకరంద్​ దేశ్​పాండే, సన్యా ఠాకూర్, రాబర్ట్​ లానెన్, దయానంద్​ రెడ్డి, నితిన్ మెహతా, అభినవ్​ గోమటం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీ చరణ్​ పాకాలు సంగీతం సమకూరుస్తున్నారు. అనిరుధ్​ కృష్ణమూర్తి మాటలు రాశారు. ఇక ఈ మూవీకి హాలీవుడ్​ స్టంట్​ డైరెక్టర్లు లీ విటేకర్​, రాబర్ట్​ లిన్నెన్​ యాక్షన్ యాక్షన్స్​ సీన్స్​ను తెరకెక్కిస్తున్నారు. వీరితోపాటు బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కెయికో నకహారా (Keiko Nakahara), హాలీవుడ్ డీఓపీ జూలియన్ అమరు ఎస్ట్రాడా (Julian Amaru Estrada) ఈ సినిమాకు పనిచేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కార్తికేయ 2తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు నిఖిల్ సిద్ధార్థ. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా కూడా మంచి విజయం అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.121 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగుతో పాటు హిందీలో రిలీజ్‌ అయిన ఈ సినిమాకు ఉత్తరాది ప్రేకక్షులు బ్రహ్మరథం పట్టారు. ఉత్తరాది, దక్షిణాదిలో అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది కార్తికేయ మూవీ. ఈ చిత్రం టీవీ ప్రీమియర్, ఓటీటీ స్ట్రీమింగ్‌లో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ చిత్రంతో పాన్​ ఇండియా హీరోగా మారిన నిఖిల్.. ప్రశంసలు, వసూళ్లు మాత్రమే కాకుండా అవార్డుల విభాగంలోనూ తన సత్తాను నిరూపించుకున్నారు. కార్తికేయ చిత్రానికి గాను ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ 2023లో నిఖిల్ సిద్ధార్థ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. తాజాగా ఈ అవార్డును నిఖిల్​ అందుకున్నారు.

Last Updated : May 15, 2023, 9:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.