ETV Bharat / entertainment

'ఆదిపురుష్' సినిమా వాయిదా!.. కొత్త రిలీజ్ డేట్ ఏంటో తెలుసా? - ఆదిపురుష్‌ ఓం రౌత్ ప్రభాస్

Adipurush Release Date: పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ నటించిన 'ఆదిపురుష్‌' గురించి ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. ఈ సినిమా విడుదల వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. కొత్త రిలీజ్ డేట్​ ఎప్పుడంటే..

speculations on prabhas adipurush release date

author img

By

Published : Oct 31, 2022, 10:07 AM IST

Adipurush Release Date : బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం 'ఆదిపురుష్'. పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈ చిత్రం గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సంక్రాంతి బరి నుంచి 'ఆదిపురుష్'​ తప్పుకున్నట్లు తెలుస్తోంది. విడుదల తేదీని వేసవికి మార్చినట్టు సినీ వర్గాల్లో టాక్​ నడుస్తోంది.

'ఆదిపురుష్​'ను ఈ సంక్రాంతికి విడుదల చేస్తామని మేకర్స్ గతంలో ప్రకటించారు. త్రీడీలో రూపొందిన ఈ భారీ బడ్జెట్‌ చిత్రం జనవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు​. ఆ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది చిత్ర బృందం. సినిమా టీజర్​ కూడా విడుదల చేశారు. అయితే పలు కారణాల వల్ల సంక్రాతికి 'ఆదిపురుష్' రావడం లేదని తెలుస్తోంది. ఈ సినిమాను వేసవికి విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. శ్రీరామ నవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతుండొచ్చని పలువురు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇప్పటికే పలువురు విశ్లేషకులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఆదిపురుష్ చిత్ర వాయిదాపై పోస్టులు పెడుతున్నారు. దీంతో అభిమానుల్లో గందరగోళం ఏర్పడింది. ఇప్పటివరకు ఈ వార్తలపై చిత్ర యూనిట్​ స్పందించలేదు. ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే త్వరలోనే మేకర్స్ నుంచి క్లారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

రామాయణం ఇతివృత్తంగా ఓం రౌత్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ఆదిపురుష్. ఇందులో రాముడి పాత్రను ప్రభాస్‌ పోషించగా.. సీత పాత్రలో కృతి సనన్‌ నటించింది. లంకేశుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ కనిపించనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి : 'నా అభిమానులు, ప్రేక్షకులకు నచ్చనిది వాళ్లపై రుద్దను'

పోలాండ్​లో 'ఈగల్'​ మూవీ షూటింగ్.. అనుపమ, కావ్యతో రవితేజ రొమాన్స్​!​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.