ETV Bharat / entertainment

'ఆర్​సీబీ' కోసం 'కేజీఎఫ్' స్క్రీనింగ్.. సూర్య సినిమాపై జాంటీరోడ్స్ ట్వీట్ - జాంటీ రోడ్స్ సూర్య

KGF Chapter2 for RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కోసం కేజీఎఫ్2 చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించింది ఆ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. ఆటగాళ్లు ఫుల్ జోష్​తో సినిమా చూశారు. మరోవైపు, సూర్య సినిమాపై జాంటీ రోడ్స్ ట్వీట్ చేశారు.

Jonty Rhodes oh my dog
KGF Chapter2 for RCB
author img

By

Published : Apr 21, 2022, 3:42 PM IST

KGF Chapter2 RCB players: దేశ ప్రజలకు అంతులేని వినోదాన్ని పంచేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్​సీబీ), కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఇదివరకే చేతులు కలిపాయి. దీంతో దేశంలో అతిపెద్ద ఎంటర్​టైనర్​లు అయిన ఐపీఎల్, సినిమాలు ఒక్కచోటికి వచ్చినట్లైంది. సినిమాలు, క్రీడలు, లైఫ్​స్టైల్ వంటి అంశాల్లో కలిసి పనిచేయనున్నట్లు ఇటీవలే ప్రకటించాయి. కేజీఎఫ్-2 సక్సెస్​తో ఫుల్ జోష్​లో ఉంది హోంబలే ఫిల్మ్స్. ఐపీఎల్​లో అదరగొడుతూ పాయింట్ల పట్టికలో దూసుకెళ్తోంది ఆర్​సీబీ. ఇక వీరిద్దరూ మరోసారి కలిశారు. కేజీఎఫ్-2 సినిమాను ఆర్​సీబీ ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ప్లేయర్లంతా ఉత్సాహంగా సినిమాను చూశారు. ఇందుకు సంబంధించిన వీడియోను హోంబలే ఫిల్మ్స్ యూట్యూబ్​లో షేర్ చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Jonty Rhodes oh my dog movie: తమిళ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'ఓ మై డాగ్'. సింబా అనే పెంపుడు శునకం, దాన్ని గారాబంగా చూసుకునే అర్జున్ అనే బాలుడి మధ్య జరిగే కథతో ఈ సినిమా తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్​లో స్ట్రీమ్ అవుతోంది. గురువారమే రిలీజ్ అయిన ఈ సినిమాపై ప్రముఖ క్రికెటర్ జాంటీ రోడ్స్ ట్వీట్ చేశారు. ఓ జంతు ప్రేమికుడిగా ఈ చిత్రాన్ని చూసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్​కు సూర్యను ట్యాగ్ చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన సూర్య... జాంటీకి థ్యాంక్స్ చెప్పారు. జాంటీ కూతురు అయిన ఇండియా రోడ్స్​కు ఈ సినిమా బాగా నచ్చుతుందని భావిస్తున్నానని అన్నాడు. జాంటీ రోడ్స్​కు భారత్ అంటే ఎంతో అభిమానం. అందుకే తన కూతురికి ఇండియా అని పేరు పెట్టుకున్నారు.

SURYA
జాంటీ ట్వీట్​కు సూర్య రిప్లై

ఇవీ చదవండి:

'ఆచార్య'కు మహేశ్​ గళం.. కలెక్షన్లలో 'కేజీఎఫ్​ -2' సరికొత్త రికార్డు!

బిడ్డ పుట్టాక కాజల్​ ఫస్ట్ పోస్ట్​.. ప్రియాంక కూతురు పేరేంటంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.