ETV Bharat / entertainment

బుడ్డోడి డైలాగ్​ విని మురిసిపోయిన బాలయ్య.. ఇంతకీ ఆ బాబు ఎవరంటే ? - బాలకృష్ణ మనవడు ఆర్యవీర్ న్యూస్​

బాలకృష్ణ, శ్రుతిహాసన్‌ జంటగా నటించిన చిత్రం 'వీర సింహారెడ్డి'. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక ఒంగోలులో ఎంతో సందడిగా జరిగింది. కాగా, ఈవెంట్​లో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు జరగ్గా ఓ బుడ్డోడు చెప్పిన డైలాగ్​ విని బాలయ్య ఎంతో మురిసిపోయారు. ఇంతకీ ఆ బాబు ఎవరంటే?

special-moments-from-veera-simha-reddy-pre-release-event
balayya grandson aryaveer
author img

By

Published : Jan 7, 2023, 2:01 PM IST

నందమూరి బాలకృష్ణ మనవడు, తేజస్విని కుమారుడు ఆర్యవీర్‌ పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో అదరగొట్టాడు. బాలయ్య నటించిన 'వీర సింహారెడ్డి' సినిమాలోని 'భయం నా బయోడేటాలో లేదురా'.. అనే డైలాగ్‌ను ఈ చిన్నోడు రీ క్రియేట్‌ చేశాడు. యాక్షన్‌ అంటూ తాతయ్య చెప్పగానే.. నాన్‌స్టాప్‌గా డైలాగ్‌ చెప్పేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను 'వీరసింహారెడ్డి' ప్రీ రిలీజ్‌ వేడుకలో ప్రసారం చేయగా.. దీనిని చూసి బాలకృష్ణ మురిసిపోయారు. ఇది మాత్రమే కాకుండా శుక్రవారం సాయంత్రం ఒంగోలులో జరిగిన ఈ ప్రీ రిలీజ్‌ వేడుకలో పలు ఆసక్తికర ఘటనలు జరిగాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అంతే కాకుండా తారక్‌ నటించిన 'జనతా గ్యారేజీ'లోని 'దివి నుంచి దిగివచ్చావా' పాటను ప్లే చేసినప్పుడు.. బాలయ్య దానిని ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు. 'జై బాలయ్య' పాటతోపాటు ట్రైలర్‌లోని సన్నివేశాలను సైతం ఆయన తనదైన శైలిలో ఆస్వాదించారు. 'జై బాలయ్య'కు అయితే ఆయన కూర్చొనే డ్యాన్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింటిలో వైరల్‌గా మారాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.