Spandana Death : ప్రముఖ కన్నడ నటి, కాంగ్రెస్ మాజీ ఎంపీ దివ్య స్పందన (రమ్య) మృతి చెందారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్‌గా అవ్వడం ప్రారంభించింది. ఆమె గుండెపోటుతో కన్నుమూశారని ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. దీంతో ఈ విషయం సినీ, రాజకీయ రంగాల్లో కలకలం రేపింది. దీంతో ఆమె ఫ్యాన్స్, సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే ఆమె చనిపోలేదని, ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె జెనీవాలో ఉన్నాట్లు కొందరు జర్నలిస్టులు పోస్ట్లు పెడుతున్నారు. బాధ్యతలేని వ్యక్తులు ఇలాంటి రూమర్స్ సృష్టిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఇక ఆమె జీవించి ఉన్నారన్న వార్తలు తెలుసుకుంటున్న ఆమె అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
Spandana Death : ప్రముఖ నటి దివ్య స్పందన మృతిచెందారా?.. అసలు నిజమిదే - కన్నడ నటి దివ్య స్పందన మృతి ఫేక్ న్యూస్
Spandana Death : కన్నడ నటి దివ్య స్పందన చనిపోయారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దీనిపై స్పష్టతవచ్చింది. ఆమె జీవించే ఉన్నారని తెలిసింది.
Published : Sep 6, 2023, 5:09 PM IST