సోనూ సూద్..పెద్దగా పరిచయం లేని వ్యక్తి. సినిమాల్లో విలన్‌గా ఎన్నో పాత్రల్లో తనదైన గుర్తింపు తెచ్చుకొన్నారు. నిజజీవితంలో మాత్రం రియల్ హీరోగా ఎంతో మంది ప్రజలను ఆదుకున్నారు. అయితే త్వరలోనే ఆయన మరో కొత్త అవతారం ఎత్తనున్నారు. 'ఫతే' మూవీతో రచయితగా మారనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి..'బాజీరావు మస్తానీ', 'శంసేరా' చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన అభినందన్ గుప్తా సహాయం చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా డిజిటల్ మోసాల నేపథ్యంలో ఉంటుందని చెప్పుకొచ్చారు. గత ఏడాదిన్నర నుంచి ఈ స్క్రిప్ట్‌పై పని చేస్తున్నట్లు వివరించారు.
'ఫతే' సినిమా కోసం ఎథికల్ హ్యాకర్లతో సంప్రదింపులు జరిపానని, ఈ సినిమా చాలా ప్రత్యేకమైనదని ఆయన చెప్పారు. సోనూసూద్ బ్యానర్ శక్తి సాగర్ ప్రొడక్షన్లో.. ఈ చిత్రం తెరకెక్కనుందని చెప్పారు. 2023 జులై-ఆగస్టు నాటికి విడుదల చేస్తామని నటుడు సోనూ సూద్ తెలిపారు. ఫతే తరవాత ఇ నివాస్ దర్శకత్వంలో మరో కొత్త సినిమా 'కిసాన్' ప్రారంభిస్తామని సోనూ సూద్ అన్నారు.
ఇవీ చదవండి : రూ.200కోట్ల కేసు.. జాక్వెలిన్‌కు మధ్యంతర బెయిల్ పొడిగింపు
దర్శకురాలిపై చీటింగ్ కేసు.. యువ నటుడిని అశ్లీల చిత్రంలో నటించమని..