ETV Bharat / entertainment

'రష్మిక మందన్న నా క్రష్​'.. శుభ్​మన్ గిల్​ క్లారిటీ - rashmika mandanna latest insta post

యంగ్​ క్రికెటర్​ శుభ్​మన్​ గిల్​ తన క్రష్​ లిస్ట్​లో ఓ కొత్త పేరును యాడ్​ చేశాడంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ వాటన్నింటికి తనదైన స్టైల్​లో ఫుల్​ స్టాప్​ పెట్టాడు. అసలు ఆమె పేరును తాను ఎక్కడ ప్రస్తావించానో తనకే తెలియదని చెప్పాడు. దీంతో ఫ్యాన్స్​ ఆశ్చర్యానికి గురయ్యారు.

shubman gill
shubman gill
author img

By

Published : Mar 7, 2023, 5:43 PM IST

తన ఆటతోనే కాదు.. తన క్రష్​ల లిస్ట్​తో ఎప్పుడూ అభిమానుల నోట్లో నానే స్టార్​ క్రికెటర్​ శుభ్​మన్​ గిల్..​ మరో సారి తన లేటెస్ట్ క్రష్ పేరు చెప్పి అందరిని షాక్​కు గురిచేశాడు.​ ఇప్పటికే ఈ స్టార్​ క్రికెటర్​ పేరును సచిన్​ కుమార్తెతో పాటు బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ సారా అలీఖాన్​ పేరుతో ముడిపెడుతున్న వేళ ఇప్పుడు మరో పేరు సోషల్​ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. నేషనల్​ క్రష్​ రష్మిక మందన్న. తాజాగా ఈ విషయాన్ని ఓ ఇంగ్లీష్​ మీడియా ప్రచురితం చేసింది. అయితే ఈ విషయంపై స్పందించిన శుభమన్​ అసలు తాను ఈ విషయాన్ని ఎక్కడ చెప్పానో తెలియడం లేదంటూ వెల్లడించాడు. దీంతో షాక్​ అవ్వడం ఫ్యాన్స్​ వంతు అయ్యింది.

shubman gill response
శుభ్​మన్​ గిల్​ రెస్పాన్స్​

ఇంతకీ ఏం జరిగిందంటే..
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో శుభ్‌మన్ గిల్.. తన క్రష్ రష్మిక మందన్న అంటూ చెప్పకనే చెప్పేశాడంటూ నెట్టింట పలు వార్తలు హల్​ చల్​ చేశాయి. 'మీకు ఇష్టమైన బాలీవుడ్ హీరోయిన్​ ఎవరు?' అంటూ ఓ ఇంటర్వ్యూలో యాంకర్​ అడిగిన ప్రశ్నకు శుభ్‌మన్..'రష్మిక మందన్న' తన క్రష్ అంటూ బదులిచ్చాడట. అయితే ఇది విన్న అభిమానులకు ఒక్కసారిగా ఫ్యూజ్​లు ఎగిరిపోయాయి. అందరూ సారా అలీఖాన్​ పేరు లేకుంటే సారా తెందుల్కర్​ పేరు చెప్తాడు అని ఎదురు చూస్తున్న టైమ్​లో రష్మిక పేరు చెప్పాడేంటంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు సారాలు మాయమై ఇప్పుడు రష్మిక.. శుభమన్ మదిని దోచిందా అంటూ కామెంట్​ చేయడం మొదలెట్టారు. ట్విట్టర్​లో వీరిద్దరి పేర్లు ట్రెండ్​ అయ్యాయి. దీనిని గమనించిన శుభ్​మన్​ గిల్.. తనదైన స్టైల్​లో మీడియాకు రిప్లై ఇచ్చాడు.

గతేడాది కూడా ఇదే విధంగా ఓ ఇంటర్వ్యూలో శుభ్‌మన్​ను.. 'బాలీవుడ్‌లో మీకు ఇష్టమైన నటి ఎవరు?' అంటూ అడగగా.. వెంటనే సారా అలీ ఖాన్​ అంటూ బదులిచ్చేశాడు. అయితే 'మీరు సారాతో డేటింగ్ చేస్తున్నారా?' అని అడగ్గా.. 'అవును, కాకపోవచ్చు' అంటూ ఆన్సర్​ ఇచ్చి అందరిని సందిగ్ధంలో పడేశాడు. ఎప్పుడూ సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉండే శుభ్​మన్ తన ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటాడు. కాగా అప్పట్లో సారా అలీ ఖాన్, శుభ్​మన్​లు జంటగా పలు సందర్భాల్లో కనిపించడం వల్ల వీరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ అభిమానులు గాసిప్​ చేయడం మొదటెట్టారు. అయితే ఈ విషయంపై అటు సారా కానీ ఇటు శుభ్​మన్​ కానీ ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం.​ ​

special gift to rashmika from uk fan
యూకే అభిమాని పంపించిన బొకే

రష్మికకు యూకే నుంచి స్పెషల్​ సర్​ఫ్రైజ్​..
'పుష్ప ది రైజ్​' సినిమాతో పాన్‌ ఇండియా లెవెల్​లోనే కాకుండా వరల్డ్​ వైడ్​ ఫ్యాన్స్​ను సంపాదించుకున్న రష్మిక మందన్నకు యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. అయితే తాజాగా ఓ అభిమాని ఆమెకు ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్​ను అందిచాడు. సీతాకోక చిలుకల డిజైన్‌తో నిండి ఉన్న ఓ కలర్‌ఫుల్‌ బొకేను యూకేలోని ఓ ఫ్యాన్‌ స్పెషల్​గా రష్మిక కోసం పంపించాడు. ఇక ఆ గిఫ్ట్​ చూసిన రష్మిక ఎమోషనల్​ అయ్యింది. ఆ అందమైన బొకేను ఫొటో తీసి తన ఇన్​స్టా స్టోరీలో షేర్​ చేసింది. 'ఈ గిఫ్ట్‌ నా హృదయాన్ని కదిలిచింది. ఇందులో పంపిన వారి పేరు లేదు, కానీ ఇది ఎవరైనా సరే వారిని నేను ఎప్పటికీ ప్రేమిస్తుంటాను. నువ్వు నిజంగా నాలో సంతోషాన్ని నింపావు, బిగ్‌ టెడ్డీ బేర్‌ హగ్స్ టూ యూ' అంటూ తన కృతజ్ఞతను ఆ పోస్ట్​ ద్వారా వ్యక్తపరిచింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.