Sharukh khan Triple dhamaka: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సినిమా థియేటర్‌లోకి వచ్చి నాలుగేళ్లైంది. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆఖరి చిత్రం 'జీరో'. 2018లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కరోనా భయాలతో షూటింగ్‌కి లాంగ్‌బ్రేక్ తీసుకున్న షారుక్, పరిస్థితులు సద్దుమణిగాక ఒక్కసారిగా వేగం పెంచాడు. అభిమానుల కరవు తీరేలా వచ్చే ఏడాది మూడు సినిమాలతో సందడి చేయనున్నాడు. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది భారీ యాక్షన్ థ్రిలర్‌గా రూపొందుతున్న 'పఠాన్'. దీపికా పదుకొణె, జాన్ అబ్రహంలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యుద్ధం నేపథ్యంతో సాగే సినిమాలకు పెట్టింది పేరైన సిద్ధార్థ్ ఆనంద్ దీని దర్శకుడు. 2023 గణతంత్ర దినోత్సవం జనవరి 26న ఈ సినిమా విడుదల కానున్నట్టు చిత్రవర్గాలు ప్రకటించాయి.
జూన్‌లో 'జవాన్'గా ప్రేక్షకుల ముందుకు వస్తాడు షారుక్. తమిళ దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. దక్షిణాది భామ నయనతార షారూక్‌తో ఆడిపాడనుంది. చిత్రవర్గాల ప్రకారం షారూక్ ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఈమధ్యే చిత్ర టీజర్ విడుదలైంది. ఇందులో పక్కా మాస్ రూపంలో కనిపించాడు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా జూన్ 2, 2023న విడుదల కానుంది.
ఈ రెండు కాకుండా సందేశాత్మక చిత్రాల దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో 'డంకీ'గా శరవేగంగా ముస్తాబవుతున్నాడు. 2023 క్రిస్మస్ కానుకగా డిసెంబరు నెలలో జనం ముందుకు రానుందీ చిత్రం. చిత్రవర్గాల సమాచారం ప్రకారం డంకీ కామెడీ-డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. ఇందులో తాప్సీ పన్ను నాయిక. ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మూడు భారీ బడ్జెట్ చిత్రాలతో రావడం కింగ్ ఖాన్ అభిమానులకు త్రిబుల్ ధమాకానే.
భయపడకు.. పాపను తీసుకొస్తా.. 'ఖుదా హఫీజ్' చిత్రంతో యాక్షన్ అభిమానులను అలరించాడు విద్యుత్ జమ్వాల్. ఇప్పుడాయన 'ఖుదా హఫీజ్-చాప్టర్ 2(అగ్నిపరీక్ష)' పేరుతో మరోసారి బాలీవుడ్‌లో యాక్షన్ హంగామా చేయనున్నాడు. దీనికి సంబంధించిన ట్రైలర్ బుధవారం విడుదలైంది. మొదటి భాగంలో తను ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్య కోసం వేట సాగించాడు విద్యుత్. చాప్టర్-2 ట్రైలర్‌లో స్కూల్ నుంచి కిడ్నాప్‌కు గురైన తన ముద్దుల కుమార్తె కోసం వెదుకుతూ కనిపించాడు. ట్రైలర్‌ను బట్టి, సినిమా యాక్షన్, ఫ్యామిలీ డ్రామా తెరకెక్కిందని తెలుస్తోంది. "భయపడకు.. పాపను తీసుకొస్తా" అంటూ విద్యుత్ చెప్పే సంభాషణలు ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లేలా కన్పించాయి. భారీ ఛేజింగ్‌లు, పోరాటాలు యాక్షన్ ప్రియులను ఆకట్టుకున్నాయి. తొలి భాగాన్ని తెరకెక్కించిన ఫరూక్ కబీరే దీనికి దర్శకుడు. శివలీక ఒబరాయ్ కథానాయిక.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'అందుకే 'విరాటపర్వం' కథను ఎంచుకున్నా'