Sharukhkhan Pathan movie: బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారూఖ్‌ఖాన్ ప్రస్తుతం 'పఠాన్' షూటింగ్లో బిజీగా ఉన్నారు. 'వార్'తో హిట్ కొట్టిన సిద్ధార్థ్ ఆనంద్.. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీపికా పదుకొనే, జాన్ అబ్రహంలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనువిందు చేయనున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను రూ.200 కోట్ల భారీ మొత్తానికి అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్టు వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలిమ్స్ ఈ వార్తలను ఇంతవరకు ఖండించలేదు.
ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత షారూఖ్ నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా "తేదీ గుర్తుంచుకోండి. 25 జనవరి 2023న పఠాన్‌గా మీ ముందుకొస్తున్నా. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో మిమ్మల్ని పలకరించబోతున్నా" అంటూ షారూఖ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇక ఈ మూవీతో పాటు అట్లీ, రాజ్‌కుమార్ హిరాణీతో కలిసి సినిమా చేయనున్నారు. హిరాణీ చిత్రానికి 'డంకీ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఇదీ చూడండి: ''సర్కారు వారి పాట'లో అసలు కథ అది కాదు..'