ETV Bharat / entertainment

రూ.100కోట్ల దిశగా 'షారుక్' పఠాన్​​.. 'కేజీయఫ్' రికార్డ్​ బ్రేక్​ - కేజీయఫ్ రికార్డ్ బ్రేక్​ పఠాన్ సినిమా

బాలీవుడ్ కింగ్ ఖాన్​ షారుక్ ఖాన్ నటించిన పఠాన్​ బాక్సాఫీస్​ను షేక్ చేస్తోంది. రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు సాధించే దిశగా దూసుకెళ్తోంది.

Sharukh pathaan collections
రూ.100కోట్ల దిశగా 'షారుక్' పఠాన్​​.. 'కేజీయఫ్' రికార్డ్​ బ్రేక్​..
author img

By

Published : Jan 26, 2023, 5:21 PM IST

భారీ అంచనాలతో విడుదలైన షారుక్​ ఖాన్​ ప‌ఠాన్ ఫ‌స్ట్ డే బాక్సాఫీస్‌ మందు దుమ్మురేపింది. తొలి రోజే హాఫ్​ సెంచరీ బాదేసింది. రూ. 55 కోట్ల‌ వసూళ్లను అందుకుందని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్​ తెలిపారు. అయితే రెండో రోజు పూర్తయ్యేసరికి కచ్చితంగా రూ.100కోట్లు అందుకుంటుందని అంచనా వేశారు. బాలీవుడ్​లో తొలిరోజు హ‌యెస్ట్​ క‌లెక్ష‌న్స్​తో భారీ ఓపెనింగ్​ను అందుకున్న తొలి సినిమాగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత స్థానాల్లో కేజీయఫ్(హిందీ) రూ.53.95కోట్లు, వార్​(రూ.51.60కోట్లు), థగ్స్​ ఆఫ్ ఇండియా(రూ.50.75కోట్లు) ఉన్నాయి.

కాగా, స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో ఇండియ‌న్ రా ఏజెంట్​గా షారుక్ ఖాన్ కనిపించారు. ఇక ఐఎస్ఐ ఏజెంట్ పాత్ర‌లో దీపికా ప‌డుకొణె నటించారు. బాలీవుడ్ భాయ్​ స‌ల్మాన్‌ ఖాన్ అతిథి పాత్ర‌లో కనిపించి సినిమాకే హైలైట్​గా నిలిచారు. భార‌త‌దేశంపై దాడికి ప్రణాళిక రచించిన ఓ ప్రైవేట్ ఏజెంట్ ప్లాన్‌ను ప‌ఠాన్ ఎలా మట్టుబెట్టాడన్నదే ఈ సినిమా కథాంశం. క‌థ కన్నా యాక్ష‌న్ అంశాల‌కే అధికంగా ప్రాముఖ్య‌త‌నిస్తూ ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను తెర‌కెక్కించారు.

షారుక్ పఠాన్ కలెతక్షన్స్​

ఇదీ చూడండి: చిరుకు రూ.50కోట్లు రెమ్యునరేషన్​!.. మరి బాలయ్య, వెంకీ, నాగ్​కు ఎంతో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.