Sharukh Khan Jawan Movie : కొంతకాలం క్రితం బాలీవుడ్ సరైన భారీ హిట్ లేక సతమతమవుతుంటే.. సౌత్ ఇండస్ట్రీ మాత్రం వరసు పాన్ ఇండియా సక్సెస్‌లను అందుకుంటూ వందల కోట్ల వసూళ్లను ఖాతాలో వేసుకుంది. వెయ్యి కోట్ల కలెక్షన్లను సాధించింది. అలాంటి సమయంలో ఐదేళ్ల పాటు గ్యాప్ ఇచ్చి పఠాన్‌తో వచ్చిన షారుక్.. ఏకంగా రూ.1000 కోట్ల కలెక్షన్లను సాధించి హిందీ పరిశ్రమకు పునఃవైభవాన్ని తీసుకొచ్చాడు.
Sharukh Jawaan Two days collections : ఇప్పుడు మళ్లీ ఏడు నెలల గ్యాప్‌లోనే సెప్టెంబర్ 7న జవాన్‌గా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో భారీ బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా రెండు రోజుల్లోనే రెండు వందల కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. లాంగ్ రన్ టైమ్‌లో రూ.1000 కోట్లు పక్కా సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక షారుక్ చేతిలో మరో సినిమా మాత్రమే మిగిలి ఉంది. అదే 'డంకీ'. ఇక ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధిస్తే.. షారుక్ హ్యాట్రిక్ హిట్ అందుకున్నట్టే.
అయితే వాస్తవానికి పఠాన్, జవాన్ సినిమాలు రొటీన్ కమర్షియల్ కథలే. మంచి యాక్షన్ సీక్వెన్స్ మాసాలా దట్టించి తన అభిమానులతో పాటు సినీ ప్రియులను ఆకట్టుకున్నారు షారుక్. భారీ యాక్షన్ విజువల్ ట్రీట్‌ను అందించారు. అంటే కమర్షియల్ కంటెంట్ ఉన్న చిత్రాలతోనే రూ. 1000 కోట్ల రేంజ్లో సక్సెస్ అందుకుంటున్నారు షారుక్. మరి అలాంటి బాలీవుడ్ బాద్ షాకు మంచి కంటెంట్ ఉన్న ఎమోషనల్ డ్రామా తగిలితే ఎలా ఉంటుంది.
Sharukh Khan Dunki Movie : ఇప్పుడు బాద్ షా తర్వాత నటించబోయే 'డంకీ' సినిమా అలాంటిదే. ప్రముఖ టాప్ డైరెక్టర్ రాజ్ కుమార్ హీరాణి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఆయన సినిమాలు.. సామాజిక అంశాలే ఇతివృత్తం చేసుకొని మనసుకు హత్తుకునేలా ఉంటాయి. గతంలో ఆయన తెరకెక్కించిన మున్నా భాయ్ ఎంబీబీఎస్, లగే రహూ మున్నాభాయ్, 3 ఇడియట్స్, పీకే, సంజు.. ఇలా ప్రతీ చిత్రం బాక్సాఫీస్ హిట్‌గానే నిలిచాయి. మరి ఇలాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌తో షారుక్ 'డంకీ' సినిమా చేయబోతున్నారు. అంటే ఈ చిత్రం.. దాదాపుగా సోషల్ మెసేజ్ అండ్ ఎమోషన్స్ డ్రామాతోనే ఉంటుంది.
కాబట్టి షారుక్.. పఠాన్, జవాన్ లాంటి రొటీన్ కమర్షియల్ సినిమాలతోనే ఈ రేంజ్ భారీ విజయాల్ని అందుకున్నారంటే.. ఇంక డంకీ లాంటి చిత్రంతో మరింత భారీ రేంజ్లో విజయాన్ని అందుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు. చూడాలి మరి ఈ డంకీ సినిమాతో షారుక్ ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటారో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి నెంబర్లను నమోదు చేస్తారా అనేది. ప్రస్తుతం ఈ విషయం ఆసక్తికరంగా మారింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">