బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'పఠాన్' విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే ఉంది. అదిరిపోయే రికార్డులను తిరగరాస్తోంది. విడుదలకు ముందు ఎన్నో విమర్శలు అందుకున్నప్పటికీ.. రిలీజ్ తర్వాత తొలి రోజు నుంచే అద్భుతమైన టాక్‌తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలై నెల రోజులు అవుతున్నా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. తొలి వారం రోజుల్లో అయితే ఏకంగా రోజుకో వంద కోట్లను ఖాతాలో వేసుకుంది. అంటే ఈ సినిమా ఏ రేంజ్లో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఐదేళ్ల విరామం తర్వాత వచ్చిన షారుక్.. ఆకలితో వేటాడే సింహాంలా గర్జించారు.
అయితే ఈ సినిమా తాజాగా మరో రికార్డును దక్కించుకుంది. ఏకంగా రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది. భారత్‌లో రూ.623కోట్లు గ్రాస్.. ఓవర్సీస్లో రూ.377కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇకపోతే వరల్డ్ వైడ్‌గా అమీర్ ఖాన్ 'దంగల్' రూ. 2,100 కోట్లు, ప్రభాస్ 'బాహుబలి 2' రూ. 1810 కోట్లు, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'కేజీఎఫ్', రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' రూ.1250కోట్లు(అంచనా) వసూలు చేశాయి.
కాగా, పఠాన్ మూవీ స్త్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా రూపొందింది. ఈ చిత్రంలో షారుక్ సరసన బాలీవుడ్ బికినీ బ్యూటీ దీపికా పదుకొణె నటించింది. జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్ భాయ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కెమియో రోల్లో కనిపంచి ఆకట్టుకున్నారు. ఆయనకు షారుక్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇకపోతే ఈ సినిమాలో షారుక్ 'పఠాన్' రోల్.. హృతిక్ రోషన్ నటించబోతే 'వార్ 2'లో గెస్ట్ రోల్‌గా కనిపిస్తుందని తెలిసింది. ఈ చిత్రానికి కూడా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇదీ చూడండి: ఈ సారి వారం గ్యాప్‌లో బాలయ్య-పవన్.. ఇక ఫ్యాన్స్‌కు పండగే!