ETV Bharat / entertainment

సమంత ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్.. 'శాకుంతలం' విడుదలయ్యేది అప్పుడే

Shakuntalam Release Date : 'శాకుంతలం' మూవీ అప్డేట్స్​ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్​కు తీపి కబురు. సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. రిలీజ్ ఎప్పుడంటే?

Shakuntalam Release Date
Shakuntalam Release Date
author img

By

Published : Jan 2, 2023, 12:40 PM IST

Shakuntalam Release Date: సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ తెరకెక్కించిన ప్రేమకావ్యం 'శాకుంతలం'. ఈ మూవీ రిలీజ్​ డేట్​ను చిత్ర బృందం అనౌన్స్​ చేసింది. ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు సమంత సోషల్​ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో పాటు ఈ సినిమాను త్రీడీలో కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Shakuntalam Release Date
శాకుంతలం రిలీజ్​ డేట్​ పోస్టర్

ఈ చిత్రానికి నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవ్‌ మోహన్‌, మోహన్‌బాబు, మధుబాల, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దీన్ని రూపొందించారు. శకుంతల, దుష్యంత మహారాజుల మధ్య ఉన్న అజరామరమైన ప్రణయ గాథ నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఇందులో శకుంతల పాత్రను సమంత పోషించగా.. దుష్యంత మహారాజు పాత్రలో దేవ్‌ మోహన్‌ నటించారు. దీన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు నీలిమ గుణ. దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. సాయిమాధవ్‌ బుర్రా మాటలు రాశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.