ETV Bharat / entertainment

పాన్ మసాలా యాడ్​లో ఆ ముగ్గురు స్టార్స్ - షాకిచ్చిన అలహాబాద్​ హైకోర్టు - షారుక్ ఖాన్ పాన్ మసాలా యాడ్

Shahrukh Khan Pan Masala AD :బాలీవుడ్​కు చెందిన అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవగన్​లకు అలహాబాద్ హైకోర్టు షాకిచ్చింది. గుట్కా యాడ్స్​ విషయం వారికి లీగల్ నోటీసులు జారీ చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Shahrukh Khan Pan Masala AD
Shahrukh Khan Pan Masala AD
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2023, 11:10 AM IST

Updated : Dec 10, 2023, 11:38 AM IST

Shahrukh Khan Pan Masala AD : బాలీవుడ్​కు చెందిన ముగ్గరు సీనియర్ నటులకు అలహాబాద్ హైకోర్టు షాకిచ్చింది. పాన్​ మసాల యాడ్స్​లో ఈ మగ్గురు నటించినందున వారికి న్యాయస్థానం లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బీ టౌన్ స్టార్స్ అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవగన్​లకు అలహాబాద్ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అయితే ఈ గుట్కా ప్రకటనలకు సంబంధించిన కేసును అటు హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా విచారిస్తోంది.

మోతీలాల్‌ యాదవ్‌ అనే న్యాయవాది గతంలో అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. భారత ప్రభుత్వం నుంచి గౌరవప్రదమైన పురస్కారాలు అందుకున్న వారు ఇలాంటి యాడ్స్​లో నటించడం సరికాదంటూ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో దీన్ని విచారించిన కోర్టు పిటిషనర్‌ అభ్యంతరాలపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని పేర్కొంటూ ఇటీవల పిటిషనర్‌ మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ విషయంపై స్పందన కోరుతూ కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌బీ పాండే శుక్రవారం కోర్టుకు సమాచారం అందించారు. ఇందులో భాగంగా అక్షయ్‌ కుమార్‌, షారుక్‌ ఖాన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌కు అక్టోబర్‌ 22నే షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని వెల్లడించారు.

మరోవైపు ఈ విషయంలో బిగ్​బీ అమితాబ్ బచ్చన్ వెనక్కి తగ్గారు. గతంలో ఆయన ఓ పాన్ మసాలా యాడ్​లో చేశారు. అయితే ఆ తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి వెనక్కి తప్పుకుని కాంట్రాక్ట్​ను బ్రేక్ చేసుకున్నారు. కానీ ఆ సంస్థ ఇంకా అమితాబచ్చన్​కు సంబంధించిన ప్రకటనను టెలికాస్ట్​ చేస్తున్నారట. దీంతో అమితాబ్‌ ఆ కంపెనీకి లీగల్‌ నోటీసులు పంపారని పాండే వెల్లడించారు. అయితే ఈ వ్యవహారంపై ఓ కేసు ఇప్పటికే సుప్రీంకోర్టు పరిధిలో ఉందని అందుకే ఇప్పటి పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా ఆయన కోరారు. వాదనలు విన్న కోర్టు.. దీనిపై తదుపరి విచారణను 2024 మే 9కి వాయిదా వేసింది.

ఆ​ యాడ్​ నుంచి వైదొలిగిన బిగ్​బీ.. కారణమేంటంటే?

ఈ తారలందరూ బన్నీ రూటే, కోట్లు ఇస్తామన్నా నో చెప్పారు

Last Updated : Dec 10, 2023, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.