Shahrukh Khan Birthday Celebrations : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసే షారుక్ .. ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఫ్యాన్స్‌ను పొందారు. రొమాంటిక్, థ్రిల్లర్, యాక్షన్ ఇలా ఎలాంటి జానర్ సినిమాల్లోనైనా సరే అవలీలగా నటించి ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంటారు. ఈ ఏడాది 'పఠాన్', 'జవాన్'తో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ఈ రెండు సినిమాలు కూడా రూ. 1000+ వసూల్ చేయడం విశేషం. ఇక ప్రస్తుతం షారుక్ 'జవాన్' సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు.
అయితే నవంబర్ 2న ఆయన 58వ బర్త్‌డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. ఓ వైపు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆయనకు విషెస్ చెప్తూ సందడి చేయగా.. మరోవైపు ఆయన నివాసం 'మన్నత్' వద్ద అర్థరాత్రి వేల మంది ఫ్యాన్స్ గుమిగూడి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ఎప్పటిలాగే షారుక్ కూడా తన ఇంటి బాల్కనీలో కనిపించి.. 'ఇంత రాత్రివేళ వచ్చి విషేస్ చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఒక నటుడిగా.. మిమ్మల్ని అలరించడమే నాకు సంతోషాన్నిస్తుంది. మీ అందరినీ ఎంటర్టైన్ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్' అని అన్నారు.
-
#ShahRukhKhan greets his fans outside Mannat on his birthday today. 🤍 pic.twitter.com/91G3xgJ04c
— Filmfare (@filmfare) November 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#ShahRukhKhan greets his fans outside Mannat on his birthday today. 🤍 pic.twitter.com/91G3xgJ04c
— Filmfare (@filmfare) November 2, 2023#ShahRukhKhan greets his fans outside Mannat on his birthday today. 🤍 pic.twitter.com/91G3xgJ04c
— Filmfare (@filmfare) November 2, 2023
మరోవైపు సెలబ్రిటీలకు కింగ్ ఖాన్ గ్రాండ్ పార్టీ కూడా అరేంజ్ చేశారు. ఈ వేడుకకు రణవీర్ సింగ్ దంపతులు, ఆలియా భట్ దంపతులు, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, జవాన్ సినిమా దర్శకుడు అట్లీ, సింగర్ మికా సింగ్, నటి కరీనా కపూర్, కరిష్మా కపూర్ హాజరయ్యారు. వీరితోపాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరై సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
-
The Man, The Myth, The Legend MS Dhoni in The Man, The Myth, The Legend Shah Rukh Khan's birthday bash - A Beautiful Picture pic.twitter.com/hU8YC4v2m8
— Rathore.....Vikram Rathore (@iamthunder847) November 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Man, The Myth, The Legend MS Dhoni in The Man, The Myth, The Legend Shah Rukh Khan's birthday bash - A Beautiful Picture pic.twitter.com/hU8YC4v2m8
— Rathore.....Vikram Rathore (@iamthunder847) November 3, 2023The Man, The Myth, The Legend MS Dhoni in The Man, The Myth, The Legend Shah Rukh Khan's birthday bash - A Beautiful Picture pic.twitter.com/hU8YC4v2m8
— Rathore.....Vikram Rathore (@iamthunder847) November 3, 2023
-
Visuals from Shah Rukh Khan 's birthday bash last night 🥵🔥 #ShahRukhKhan pic.twitter.com/msFfoUoXLK
— ℣αɱριя౯ (@SRKsCombatant) November 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Visuals from Shah Rukh Khan 's birthday bash last night 🥵🔥 #ShahRukhKhan pic.twitter.com/msFfoUoXLK
— ℣αɱριя౯ (@SRKsCombatant) November 3, 2023Visuals from Shah Rukh Khan 's birthday bash last night 🥵🔥 #ShahRukhKhan pic.twitter.com/msFfoUoXLK
— ℣αɱριя౯ (@SRKsCombatant) November 3, 2023
ఇదిలా ఉండగా.. అర్ధరాత్రి షారుక్ ఇంటి వద్ద ఫ్యాన్స్ సందడి నెలకొన్న సమయంలో అక్కడ దొంగతనం జరిగినట్లు తెలిసింది. కిక్కిరిసిపోయిన గుంపు నుంచి దాదాపు 30 ఫోన్లు చోరికి గురయ్యాయట. దీనిపై ఫిర్యాదు అందుకున్న బాంద్రా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ ట్రిక్‌ను వాడుకుంటున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ - 'జవాన్' విషయంలోనూ అదే జరిగిందా?
స్టార్ హీరో కాదు.. కానీ ఈ యాక్టర్ చివరి మూడు సినిమాల కలెక్షన్లు రూ.1900 కోట్లు!