ETV Bharat / entertainment

Shahrukh Khan Bald Look : 'జవాన్​'లో షారుక్​ అందుకే 'గుండు'తో కనిపించారట.. రెమ్యునరేషన్​గా దీపిక ఒక్క రూపాయి కూడా.. - జవాన్ షారుక్​ గుండు లుక్​

Shahrukh Khan Bald Look : బాక్సాఫీస్​ వద్ద దుమ్మురేపుతున్న 'జవాన్'​ మూవీలో షారుక్​ ఖాన్​.. గుండు లుక్​తో కనిపించి సందడి చేశారు. అయితే ఈ సినిమాలో తన గుండు లుక్​ వెనుక కారణాన్ని వెల్లడించారు. మరోవైపు, ఈ చిత్రంలో తాను తీసుకున్న రెమ్యునరేషన్​పై దీపికా పదుకుణె క్లారిటీ ఇచ్చారు. ఆ విశేషాలు మీకోసం..

Shahrukh Khan Bald Look
Shahrukh Khan Bald Look
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 1:35 PM IST

Shahrukh Khan Bald Look : బాలీవుడ్​ బాద్​షా షారుక్ ఖాన్​ నటించిన 'జవాన్'​ సినిమా.. బాక్సాఫీస్​ వద్ద భారీ లాభాలతో దూసుకుపోతోంది. కోలీవుడ్​ డైరెక్టర్​ అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుక్​ డిఫరెంట్​ గెటప్స్​తో ఆకట్టుకున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు లేని విధంగా గుండుతో కనిపించి షాక్​ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో తన బాల్డ్​ లుక్​ గురించి షారుక్​ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

జవాన్​లో గుండుతో నటించాలని తెలియగానే మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అని అడిగిన ప్రశ్నకు "కేవలం సోమరితనం కారణంగానే సినిమాలో ఆ లుక్‌ను ఎంచుకున్నా అని షారుక్ చెప్పారు. "ఈ లుక్ స్క్రిప్ట్​లో భాగమే కాదు. స్క్రిప్ట్​లో ఉన్న గెటప్స్‌లో ఒక భాగం మాత్రమే. బద్ధకం వల్లే నేను ఈ గుండు లుక్‌ను ఎంచుకున్నాను. ఎందుకంటే ఇలాంటి లుక్ సెలెక్ట్ చేసుకుంటే నేను రెండు గంటలు మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఆ లుక్​లోనే కొన్ని సీన్స్ చేశాను. ఈ లుక్​కు సంబంధించిన కొన్ని ప్రోమోస్‌ను మా ఫ్రెండ్స్​కు చూపించాను. అది చూసి ఈ లుక్ చాలా భయంకరంగా ఉంది. అమ్మాయిలైతే నిన్ను అస్సలు లైక్ చేయరు అని చెప్పారు. అయితే కచ్చితంగా ఈ లుక్​లో అమ్మాయిలు నన్ను ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. నన్నే కాదు గుండుతో ఉన్న మగాళ్లను అమ్మాయిలు ఇష్టపడతారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నాకు కూడా గుండుతో ఉన్న అమ్మాయిలు అంటే ఇష్టం" అని సరదాగా తన ఫ్రెండ్స్​తో చెప్పానని అన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రెమ్యునరేషన్​పై దీపిక క్లారిటీ..
Jawan Deepika Remmuneration : మరోవైపు, 'జవాన్​'లో స్టార్​ హీరోయిన్​ దీపికా పదుకొణె.. అతిథి పాత్రలో కనిపించి సినిమాకు మరింత అందాన్నిచ్చారు. అయితే ఈ చిత్రం ప్రారంభమైన దగ్గరి నుంచి ఆమె రెమ్యునరేషన్‌ గురించి రకరకాల వార్తలు నెట్టింట ప్రచారమవుతున్నాయి. తాజాగా వీటిపై ఆమె స్పందించారు.

"ఇటీవల వచ్చిన కొన్ని సినిమాల్లో నేను అతిథి పాత్రలు చేశాను. తాజాగా వచ్చిన జవాన్‌తో పాటు రణ్‌వీర్‌ సింగ్ '83', 'సర్కస్‌' సినిమాల్లోనూ నేను కనిపించాను. ఆ కథలు నచ్చి వాటిలో భాగం అయ్యాను. '83'లో కనిపించడానికి ప్రత్యేక కారణం ఉంది. మహిళలు ఎన్ని త్యాగాలు చేస్తారో ఆ సినిమాలో చూపించారు. అంత గొప్ప చిత్రంలో నేను నటించాలని కోరుకున్నా. అలాగే జవాన్‌ కథ కూడా నాకెంతో నచ్చింది. ఇక షారుక్‌తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మేమిద్దరం మంచి స్నేహితులం. జవాన్‌లో నా పారితోషికం గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. నేను ఆ సినిమా కోసం రూపాయి కూడా తీసుకోలేదు" అని దీపికా వెల్లడించారు.

Jawan Movie Collections : ప్రస్తుతం థియేటర్స్​లో సందడి చేస్తున్న 'జవాన్' కలెక్షన్స్ ఇప్పటికే ఇండియా వైడ్​గా రూ.700 కోట్ల మార్క్​కు చేరువలో ఉంది. నయనతార హీరోయిన్​గా నటించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి విలన్ రోల్​లో ఆకట్టుకున్నారు. దీపికా పదుకొణె, సంజయ్ దత్ కామియో రోల్స్​లో కనిపించారు. అనిరుధ్​ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ మూవీలో సానియా మల్హోత్రా, ప్రియమణి, యోగి బాబు, సునీల్ గ్రోవర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

Jawaan Budget : అట్లీ-నయన్ కలిపి రూ.40 కోట్లు​.. షారుక్​ షాకింగ్ రెమ్యునరేషన్​.. ఎన్ని వందల కోట్లంటే?

Sharukh Khan Dupe : 15 ఏళ్లుగా షారుక్​కు డూప్.. 'జవాన్​'లో కూడా.. ఆయన రెమ్యునరేషన్​ తెలిస్తే షాకే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.