ETV Bharat / entertainment

బాలీవుడ్​లో కరోనా కలకలం.. షారుక్​, కత్రినాలకు పాజిటివ్​.. మరో 50 మందికి కూడా! - షారుక్​ ఖాన్​

బాలీవుడ్​ స్టార్స్​ షారుక్​ ఖాన్​, కత్రినాకైఫ్​లు కరోనా బారినపడ్డారు. వీరితో పాటు ఇప్పటికే అక్షయ్​ కుమార్, కార్తిక్​ ఆర్యన్, ఆదిత్య రాయ్​ కపూర్​ మొదలైన నటులకు కూడా పాజిటివ్​ అని తేలింది. వీరంతా గతవారం కరణ్​జోహార్​ ఏర్పాటు చేసిన పార్టీకి హాజరయ్యారు.

covid
covid
author img

By

Published : Jun 5, 2022, 4:54 PM IST

బాలీవుడ్​లో మరోసారి కరోనా కలకలం సృష్టిస్తోంది. బడా స్టార్లు అందరూ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే కార్తిక్​ ఆర్యన్, ఆదిత్య రాయ్​ కపూర్, అక్షయ్​ కుమార్​లకు కొవిడ్​ పాజిటివ్​ అని తేలగా తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్​ బాద్​షా షారుక్ ​ఖాన్, కత్రినా కైఫ్​లు చేరారు. వీరితో పాటు మరికొంత మంది నటీనటులకు కూడా కరోనా లక్షణాలు ఉన్నట్లు సమాచారం.

ఆ పార్టీ వల్లేనా?: ఇలా వరుసగా అందరికీ కరోనా పాజిటివ్​లు రావడం వెనుక కరణ్​ జోహార్​ ఇచ్చిన పార్టీనే కారణం అంటూ సోషల్​ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కరణ్​ ఇల్లు కొవిడ్​ హాట్​స్పాట్​గా మారిందని పేర్కొంటున్నారు. ఆ పార్టీకి వచ్చిన వారిలో సుమారు 40-50 మందికి కొవిడ్​ పాజిటివ్​ అని తేలినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ విషయాన్ని కరణ్​ సన్నిహితులు కొట్టిపారేశారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కరణ్​ ఇల్లు కొవిడ్​ హాట్​స్పాట్​ ఏం కాదని స్పష్టం చేశారు. కరణ్​ నిర్వహించిన ఆ పార్టీకి సల్మాన్​, షారుక్​, అనన్య పాండే, విక్కీ కౌషల్ - కత్రినా దంపతులు, ఐశ్వర్యరాయ్​ సహా ఎందరో బాలీవుడ్​ ప్రముఖులు హాజరయ్యారు.

ఇదీ చూడండి : నయన్​-విఘ్నేశ్ పెళ్లి కన్ఫామ్​​.. సీఎంకు ఆహ్వాన పత్రిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.