ETV Bharat / entertainment

షారుక్​ 'మన్నత్​'లోకి కొత్త కారు ఎంట్రీ.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే.. - షారుక్ ఖాన్​ న్యూ కార్​

'పఠాన్'​ సక్సెస్​ను ఆస్వాదిస్తున్న బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఆయన ఓ కారు కొన్నారట. ఈ విషయం ప్రస్తుతం నెట్టింట హల్​చల్​ చేస్తోంది. ఇంతకీ ఆ కారు ఖరీదు ఎంతంటే?

sharukh khan new car
sharukh khan new car
author img

By

Published : Mar 28, 2023, 9:44 AM IST

బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​ తన లేటెస్ట్​ మూవీ 'పఠాన్'​​తో నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్​లోకి ఓ సాలిడ్​ హిట్​తో రీ ఎంట్రీ ఇచ్చారు. రిలీజ్​కు ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్​తో సెన్సేషన్​ క్రియేట్ చేసిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద కూడా కాసలు వర్షం కురిపించి రికార్డుకెక్కింది. అలా వంద కోట్ల నుంచి ఏకంగా 1000 కోట్ల క్లబ్​లోకి చేరుకుంది. ఇక షారుక్​ కెరీర్​లో అత్యధికంగా వసూళ్లు సాధించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం.

అయితే ఇటీవలే షారుక్​ రూ.10 కోట్లు విలువ చేసే ఓ కారు కొన్నారట. అదే రోల్స్​ రాయిస్ కంపెనీకి చెందిన కలినన్ బ్లాక్ బ్యాడ్జ్ మోడల్​ కారు. ఇక ఈ కారు రాకతో ఇప్పటివరకు ఉన్న తన లగ్జరీ కార్ల కలెక్షన్లోకి మరోకటి యాడ్​ అయ్యింది. ఈ కొత్త కారును చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని ఆయన అధికారికంగా చెప్పకపోయినప్పటికీ కారుకు సంబంధించి ఫొటోలతో పాటు కొన్ని వీడియోలు ప్రస్తుతం నెట్టింట హలచల్​ చేస్తున్నాయి. ఇక షారుక్​ లగ్జరీ కార్ల కలెక్షన్​లో బీఎండబ్ల్యూ, బెంట్లీ, బుగాటీతో పాటు మరికొన్ని కార్లు కూడా ఉన్నాయి.

ఇక 'పఠాన్'​సక్సెస్​ను ఆస్వాదిస్తున్న బాలీవుడ్​ బాద్​షా ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు. 'జీరో' మూవీ తరువాత నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్న ఈ స్టార్ హీరో 'పఠాన్'​తో బాక్సాఫీస్​ను షేక్​ చేశారు. ​ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శక్వంలో వస్తున్న 'జవాన్' అనే సినిమా​లో నటిస్తున్నారు. ఇందులో షారుక్​ సరసన లేడీ సూపర్​ స్టార్​ నయనతార నటిస్తుండగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

'పఠాన్'​ తర్వాత షారుక్​ నటిస్తున్న సినిమా కావడం వల్ల ఈ సినిమాపై హై ఎక్స్​పెక్టేషన్సే పెట్టుకున్నారు అభిమానులు. అంతే కాకుండా 'త్రీ ఇడియట్స్​' ఫేమ్​ దర్శకుడు రాజ్​కుమార్​ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డంకీ' అనే సినిమాకు కూడా సైన్​ చేశారు షారుక్​. ఇక ఈ సినిమాలో షారుక్​కు జోడీగా బాలీవుడ్​ బ్యూటీ తాప్సీ నటిస్తున్నారు. మరోవైపు సల్మాన్ ఖాన్ 'టైగర్​3' లోనూ గెస్ట్​ రోల్​లో కనిపించనున్నారట.

ఇటీవలే షారుక్​ ఖాన్ 'పఠాన్'​లోనూ సల్మాన్​ ఖాన్​ అతిథి పాత్రలో కనిపించి కనువిందు చేశారు. అయితే అప్పట్లో షారుక్​ నటించిన 'కుచ్​ కుచ్​ హోతా హై' సినిమాలోనూ సల్మాన్​ గెస్ట్​ రోల్​లో మెరిశారు. దీంతో ఇప్పుడు సల్మాన్​ సినిమాలో షారుక్​ ఎంట్రీ ఎలా ఉండనుందో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.