ETV Bharat / entertainment

నట విశ్వరూపం, తెలుగుజాతి ఆత్మగౌరవం.. జయహో 'ఎన్టీఆర్' - senior ntr birthday special

NTR 100 year Birth anniversary: ఆ రూపం సమ్మోహనం. సుమనోహరం. అభినయ వేదం. నటనకు విశ్వవిద్యాలయం. తెలుగువారి ఖ్యాతిని విశ్వమంతా ఎలుగెత్తి చాటిన జాతిరత్నం. తెలుగుజాతి ఐక్యతా చిహ్నం. వెండితెరవేల్పు. మేలుకొలుపు. ప్రేక్షక ప్రపంచ ఆరాధ్యదైవం. తెలుగుసినీ వజ్రోత్సవ చరిత్రలో ఆయనో సువర్ణాధ్యాయం. సాంఘికం, పౌరాణికం, చారిత్రకం, జానపదం.. ఏదైనా ఆయనకు నటనే ప్రాణప్రదం. ఆకర్షించే ఆహార్యం. ఆకట్టుకునే అభినయం. అలరించే గళం. సుస్వర భాస్వరం. వెరసి తెలుగు సినిమాకు ఆయన ఓ వరం. ఆయనే నందమూరి తారక రామారావు. నేడు ఆయన జయంతి సందర్భంగా ఎన్టీఆర్​ గురించి ప్రత్యేక కథనం..

Senior NTR 100 year Birth anniversary special
సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు
author img

By

Published : May 28, 2022, 5:31 AM IST

NTR 100 year Birth anniversary: ఆయనో విశ్వరూపం. వెండితెరపై తెలుగుదనానికి నిలువెత్తు సంతకం. నటనకు రాజముద్ర. అశేష ప్రేక్షకజన హృదయాలపై చెరగని ముద్ర. ఆయన సినిమాలు సామాజిక చైతన్య ప్రబోధాలు. కర్తవ్య సందేశాలు. ఆయనే నందమూరి అందగాడు. జానపదాల్లో వగలరాణికి సొగసుగాడు. సాంఘిక చిత్రాలలో ప్రేక్షక హృదయాలు కొల్లగొట్టిన 'వేటగాడు'. పౌరాణికాలలో కొలుపులు అందుకున్న యుగ పురుషోత్తముడు. నటసార్వభౌముడు. నందమూరి తారకరాముడు. తెలుగు సినీ చరిత్రకే కథా నాయకుడు. ఆయనే ప్రజలంతా ప్రేమగా పిలుచుకునే ఎన్టీవోడు.

తెలుగుజాతి ఐక్యతను ఆకాంక్షించిన తెలుగోడు.. జన హృదయాల్లో ఎన్టీవోడు.. నందమూరి తారక రామారావు. పల్లె, పట్టణం, నగరం, దేశం. ఒక్కచోట ఏమిటి? ఎక్కడైనా ఆయనే కథానాయకుడు. నటరత్న ఎన్టీ రామారావు నిజంగా, నిండుగా విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు. ప్రపంచమంతా ఆయన అభిమాన ప్రపంచాలే. ఆయన అభిమానులు లేని ప్రపంచమే లేదు. ఎన్టీరామారావంటే శ్రీకృష్ణుని చిద్విలాసం. శ్రీరాముని ఆకర్షణీయ ముఖారవిందం. రారాజు రాజసం. రావణబ్రహ్మ ధీర గంభీర్యం. కైలాసంలో కొలువైన శివరూపం. శ్రీవేంకటేశ్వరుని దివ్యమంగళ స్వరూపం. దశావతారాల విరాట్‌ స్వరూపం. తోట రాముడుగా వచ్చి ప్రేక్షక హృదయ సింహాసనం గెలిచి, కోటరాముడయ్యాడు.

బాల్యం: నాటి మద్రాసు ప్రెసిడెన్సీలో కృష్ణాజిల్లాలో పచ్చని పల్లెటూరు నిమ్మకూరు. పాడిపంటలతో అలరారే ఆ గ్రామం. ఆ గ్రామంలో నందమూరి లక్ష్మయ్య, వెంకటరావమ్మల కుమారుడే నందమూరి తారకరామారావు. అమ్మవొడిలో అక్షరాలు దిద్దుకున్నాడు. ఆకలిమంటల రుచి తెలిసినవాడు. చదువుతూనే ..చిరువ్యాపారాలు చేసి కుటుంబానికి ఆదరువుగా నిలిచాడు. ఆరోజుల్లో గ్రామానికి వచ్చే భాగవతుల కళా ప్రదర్శనలు ఎన్టీఆర్ మనసుమీద ప్రగాఢ ముద్రవేశాయి.

Senior NTR 100 year Birth anniversary special
ఎన్టీఆర్​

అలా సినిమాల్లోకి... అప్పటికే మద్రాసులో అవకాశాల కోసం నిశ్శబ్దంగా యత్నాలు సాగిస్తున్నారు. ఆకట్టుకునే ముఖవర్చస్సు. కంగున మోగే కంఠస్వరం. ఆపై స్నేహితుల ప్రోత్సాహం . కాళ్లే కాదు కళ కూడా ఊరుకోనివ్వదు కదా. ఎక్కడ నాటకాలుంటే అక్కడికి వెళ్లేవాడు. పెదనాన్న రామయ్య గారు ఆ వూళ్లో కాస్త క్లాసుగా కనపడేవారు. సోకురామయ్య అని పిలుచుకునే వారు. ఆయన రంగస్థల నటుడు. ఇంటర్ చదువుతుండగా ర్ ఆయన కళా స్పర్శతో ఎన్టీఆర్ బెజవాడ ఎస్.ఆర్.ఆర్ కళాశాలలో బాల నాగమ్మ వేషం వేశారు. డిగ్రీ అయ్యాక సర్వీసు కమిషన్ పరీక్షల్లో ఎంపికై మంగళగిరిలో సబ్-రిజిస్ట్రార్‌ అయ్యారు. కానీ సినిమాల్లో నటించాలని మనసు ఉవ్విళ్లూరుతోంది. తెలుగు సినీ దర్శకుడు, దార్శనికుడు, నిర్మాత, ఎల్వీ ప్రసాద్ దగ్గర ఓసారి నిర్మాత బియ్యే సుబ్బారావు ఎన్టీఆర్ ఫొటో చూశారు. ర్మాత బీయ్యే సుబ్బారావు స్క్రీన్ టెస్టు కోసం కబురు చేశారు. ఉన్నపళంగా రైలెక్కి మద్రాసు రావాలని కోరారు. టెస్టు పూర్తయ్యాక..మరో ఆలోచన లేకుండా తను తీస్తున్న పల్లెటూరిపిల్ల సినిమాలో ఎన్టీ ఆర్ కు అవకాశమిచ్చారు. సినిమా చిత్రీకరణ సందర్భంలో ఎన్టీఆర్ నటన చూసిన ఎల్వీప్రసాద్‌ తను తీస్తున్న 'మనదేశం' సినిమాలో వేషమిచ్చారు. గమ్మత్తుగా బీయ్యే సుబ్బారావు సినిమా ‘పల్లెటూరిపిల్ల’ కంటే ముందు, ఎల్వీప్రసాద్ సినిమా 'మనదేశం విడుదలైంది. సత్యాగ్రహుల మీద లాఠీచార్జి చేసే క్రూర పోలీసు అధికారిగా నెగెటివ్ షేడ్ పాత్ర అది. అవకాశాలను పాజిటివ్ గా మలుచుకోవటానికి నెగెటివ్ పాత్రలయినా ఫర్వాలేదనుకున్నారు ఎన్టీఆర్. వరుసగా వస్తున్న సినిమా అవకాశాలతో మంగళగిరిలో ఉద్యోగం వదలిసి య చెన్నపట్నం వెళ్లిపోయారు. సినిమా ప్రపంచం పిలుపే ఆయన సినీ జీవితానికి మేలుమలుపు అయ్యింది. తర్వాత కాలంలో వెండితెరమీద ఆయన్ని అగ్రహీరోగా నిలిపింది. విశ్వవిఖ్యాతం చేసింది. 'మనదేశం' చిత్రంలో ఎన్టీఆర్ ది ఒక డైలాగు ఉంది. ' ఇంతవాణ్ణి కావటానికి ఎంత కష్టపడి పైకి వచ్చానో తెలుసా?' ఆ సంభాషణ ఆ తర్వాత కాలంలో అచ్చంగా, అక్షరాల ఆయన జీవన క్రమానికి సరిపోయింది.

ఎన్టీఆర్​కు స్టార్ డమ్: 1951లో కేవీ రెడ్డి తెరకెక్కించిన 'పాతాళభైరవి' చిత్రంలో ఎన్టీఆర్ చక్కని నటవైదుష్యం ప్రదర్శించారు. సాహసాలు చేసే డింభకుడుగా, తోటరాముడి పాత్రలో అతడి ఖ్యాతి కోటలు దాటింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ కు ఒక స్టార్ డమ్ వచ్చింది. తర్వాత వచ్చిన 'షావుకారు' లో నటనకు ఎన్టీఆర్ కు మరిన్ని మార్కులు పడ్డాయి. వాహినీ బ్యానర్ పై బీఎన్ రెడ్డి అదే ఏడాది ఎన్టీఆర్-భానుమతి కాంబినేషన్‌తో 'మల్లీశ్వరి ' సినిమా తీశారు. ఆచిత్రం ప్రేక్షకుల మనసున మల్లెల మాలలూగించిది. వెండితెర అపురూప దృశ్యకావ్యం గా నిలిచింది.

పాతాళభైరవి, షావుకారు, మల్లీశ్వరి సినిమాల్లో నటనతో ఎన్టీఆర్ కు అగ్ర హీరోగా గుర్తింపు వచ్చింది. ‘పిచ్చి పుల్లయ్య’లో అమాయకుడుగా జీవించారు. ఆ నటనకు ఎన్టీఆర్ ను ప్రేక్షకులూ దీవించారు. 1955 విజయ-వాహిని వారి‘'మిస్సమ్మ’ఎన్టీరామారావు, సావిత్రి అపూర్వ నటనకు అద్దంపట్టిన సినిమా. ఇంకా ఏయన్నార్, జమున నటించారు. గురజాడ రచన ‘కన్యాశుల్కం’నాటకానికి వెండితెర దృశ్యకథారూపం ' కన్యాశుల్కం' చలనచిత్రం. సంస్కర్త ముసుగులో మోసాలు చేసే గిరీశం పాత్రలో ఎన్టీఆర్ నటనను ప్రేక్షకులు ఆస్వాదించారు. పెద్ద హీరోగా ఎదుగుతున్న క్రమంలో ఎన్టీఆర్ డీ గ్లామర్ పాత్రల్లో నటించడానికీ వెనుకాడలేదు. 1956 లో విడుదలైన ‘చిరంజీవులు’ లో ఆయన అంధుడి పాత్రను పోషించారు. అలాంటివి అనేక వేషాలను చెప్పుకోవచ్చు. దివ్యాంగులని, కురూపులని సమాజం చిన్నచూపు చూసే వారి హృదయవేదనను తను ధరించే ఆ పాత్రలలో పలికించేవారు. అందుకే ఎన్టీఆర్ అందరికీ ఆరాధ్యుడయ్యారు కావచ్చు.

ఎన్టీఆర్ శత జయంతి

చరిత్రకు శ్రీకారం.. 1957 వ సంవత్సరం. తెలుగు సినిమా వెండితెరపై ఒక చరిత్రకు శ్రీకారం. వెండితెరపై శ్రీకృష్ణ పాత్ర ఆవిష్కారం. 1957లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మాయాబజార్' చిత్రం ఎన్టీ రామారావును వెండితెర వేల్పుగా నిలిపింది. శ్రీకృష్ణుడు అచ్చం ఇలాగే ఉంటాడా?' ఇలాగే ఉంటే బావుండు!' అని ప్రేక్షుకులు అనుకునేంత సమ్మోహన రూపంలో దర్శనమిచ్చారు. అతిరథ మహారథ నటుల సమ్మేళనంలో వచ్చిన ఆ సినిమా తెలుగువారి అపురూప దృశ్యకావ్యమైంది. వాల్ పోస్టర్లలో ఉండే నటుడు ఎన్టీఆర్ ప్రజల గుండె గుడిలో కొలువై పూజలు అందుకున్నారు. ఎన్టీఆర్ ఎప్పుడూ మారువేషాల తరహా వైవిధ్యపాత్రలంటే ఇష్టపడేవారు. 1958లో ప్రేక్షకులను అలరించిన సినిమా ‘అన్నాతమ్ముడు’ సినిమానే అందుకు తార్కాణం. ఈ సరదా సరదా సినిమాలో స్త్రీ వేషధారణలో రామారావు నటన నవ్వులు పూయించింది. 1959లో ఎన్టీఆర్, దేవిక తదితరులు నటించిన శభాష్ రాముడులో ‘జయంబు నిశ్చయంబురా’ గీతం వ్యక్తిత్వ వికాసానికి పాఠం.

సందేశాత్మాక గీతాలు.. ఎన్టీఆర్ నటించిన సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక సినిమాలన్నింటిలో అంతర్లీనంగా ఏదో ఒక సందేశాత్మకగీతం ఉండేది. రైతాంగ సమస్యలు, వారి కష్టాలే కథాంశాలుగా వచ్చిన అనేక చిత్రాలలో ఎన్టీఆర్ నటించారు. రైతు కూలీల పక్షం వహించారు. అలాంటి చిత్రమే ‘కాడెద్దులు-ఎకరం నేల’. 1961లోనే విడుదలైన 'కలసివుంటే కలదు సుఖం' చిత్రం ఎన్టీ రామారావు నటవైవిధ్యానికి, విశిష్టతకు దర్పణం పట్టింది. అవిటి వాడిగా డీ గ్లామర్ పాత్రకు ఎంతో సహజత్వంతో అలా నటించటం ఆయనకే చెల్లింది.

1962లో విడుదలైన ‘ రక్త సంబంధం’ సెంటిమెంట్ పండించిన సినిమా. ఇందులో 'చందురుని మించు అందమొలికించు’' గీతం బరువైన గీతమే. కానీ కరుణపొంగిందో, శోకరసం పొంగిందో , శాంత రసం ఉప్పొంగిందో అర్ధం చేసుకోలేని పరిస్థితి. ఎన్టీఆర్, సావిత్రి నటించిన ‘ఆత్మబంధువు’ లో అనగనగా ఒక రాజు పాట పిల్లలకూ, పెద్దలకూ ఎంతో నచ్చిన గీతం. ఈ గీతాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ ఆస్వాదిస్తారు.

ఎన్టీరామారావు సాంఘిక చిత్ర విజయాలతో దూసుకెళుతున్న సమయం అది. 1962లో విడుదలై ప్రేక్షకుల మనసులను మురిపించిన కుటుంబ కథా చిత్రం 'గుండమ్మ కథ'. నాగిరెడ్డి-చక్రపాణి విజయాసంస్థ బ్యానర్ మీద నిర్మించిన ఈ సినిమా ఒక క్లాసిక్ గా నిలిచింది. మహిళాసాధికారతకు ఈ పాట ఒక ప్రబోధ గీతంగా నేటికీ అలరిస్తోంది. ఈ సినిమాలో విచిత్ర ఆహార్యంలో అంజిగాడుగా ఎన్టీఆర్ నటన నవ్వులు పూయించింది. మరుసటి ఏడాది వచ్చిన ‘లక్షాధికారి’లో ‘మబ్బులో ఏముంది? పాటలో ఒక ప్రేమ సంవాద తరహా రచన. ప్రశ్న, జవాబు తరహాలో సాగిన ఈ పాట ఎంతో ఆకట్టుకుంది . ఇదే క్రమంలో విడుదలైన ‘దేశ ద్రోహులు’ సినిమాలో ఉదాత్త సాహిత్యంతో అలరించే మధురగీతం 'జగమే మారినదీ'.

1964లో ‘రాముడు- భీముడు’ ఎన్టీఆర్‌ సాంఘిక చిత్రాలలో చెరగని ముద్రవేసిన చిత్రంగా మిగిలింది. ‘మంగమ్మ శపథం’ లో టీవీరాజు స్వరకల్పనలో ఈ పాట ప్రేక్షకులను మెప్పించింది. 1967లో ఎన్టీఆర్ సొంత చిత్రం ‘ఉమ్మడి కుటుంబం’ గొప్ప కుటుంబ కథా చిత్రం.

1970 లో వెండితెరకెక్కిన 'తల్లా?పెళ్లామా?' సందేశాత్మక చిత్రం. అమ్మ, జీవన సహచరి ఇద్దరూ రెండు కళ్లలాంటివారన్న అంశాన్ని గుండె ఘోషగా పలికించారు. స్త్రీజాతి ఔన్నత్యాన్ని చాటిన చిత్రం ఇది. తెలుగుజాతి ఒక్కటిగా, ఐక్యంగా ఉండాలని ఎన్టీఆర్ మనసావాచా విశ్వసించారు. ఈ నేపథ్యంలో 'తల్లాపెళ్లామా?' లో ఒక ప్రబోధగీతం పెట్టారు. 1969లో ఏకవీర చిత్రం కోసంఘంటసాల, ఎస్పీబాలు కలసి ఆలపించిన అద్భుత గీతం 'ప్రతిరాత్రి వసంతరాత్రి'. ఇలా ఆయన ప్రతీ సినిమాలో సందేశాత్మక పాటలు ఉన్నాయి.

యువ దర్శకుల ఎంట్రీతో మళ్లీ తిరుగులేని హీరోగా.. ఎంతటి మహానటుడికైనా కెరీర్ లో ఎత్తుపల్లాలు సహజం. ఎన్టీరామారావుకు 1975 తర్వాత కెరీర్ లో అన్ని విజయాలేమీ లేవు. కృష్ణ తో నటించిన దేవుడు చేసిన మనుషులు, తర్వాత తను నటించిన నిప్పులాంటి మనిషి తర్వాత కొంత గ్యాప్ తప్పలేదు. సరిగ్గా ఈ సమయంలో నాడు ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ వచ్చి ఎన్టీఆర్ కెరీర్ గ్రాఫ్ మార్చి వేశారు. తర్వాత కాలంలో వారిలో ఒకరు దర్శకేంద్రుడుగా, మరొకరు దర్శక రత్నగా ప్రసిద్ధి చెందారు. వారే అప్పటి యువ దర్శకులు దాసరి, రాఘవేంద్రరావు. 1976లో దాసరి ఎన్టీఆర్​తో హిట్​ మూవీ 'మనుషులంతా ఒక్కటే' చేస్తే.. 1977లో రాఘవేంద్రరావు సెన్సెషనల్​ హిట్​ అడవిరాముడు తీశారు. ఆ తర్వాత ఇద్దరితో వరుసపెట్టి సినిమాలు తీశారు ఎన్టీఆర్​. అన్ని సినిమాలు బ్లాక్​ బస్టర్లు, సిల్వర్​ జూబ్లీలే. ఆ సినిమాలు ఎన్టీఆర్​ను ఎదురులేని, తిరుగులేని హీరోగా నిలబెట్టాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆయన సినిమాలదే అగ్రస్థానం.. మొత్తంగా ఎన్టీఆర్​ 295 చిత్రాలలో నటించారు. వీటిలో 278 తెలుగు, 14 తమిళం, మూడు హిందీ. ఎన్టీఆర్​ సినిమా పాత్రలలో కనిపించినంత వైవిధ్యం మరో హీరో దగ్గర ఎక్కడా కనిపించదు! నాయకుడు, ప్రతినాయకుడు, తండ్రి కుమారుడు - ఇలా అన్ని పాత్రలనూ ఆయన ఏకకాలంలో తనదయిన బాణీలో రక్తికట్టించారు. వసూళ్ళలో ఆయన సినిమాలది అగ్రస్థానం. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు చెప్పినట్లు, మొత్తం భారతదేశంలోనే మినిమమ్ గ్యారంటీ కలిగిన అరడజను మంది హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించిన ఆయన సినిమాలు అనేకం. విజయా-వాహిని ఆసియాలోనే అతిపెద్ద స్టుడియోగా అభివృద్ధి చెందిందంటే, అందుకు తొలి రోజులలో ఆయన నటించిన సినిమాలు చేసిన దోహదం అపారం. అన్నీ జూబిలీ సినిమాలే ఆయన సినిమాలన్నీ కలిసి వసూలు చేసిన కలెక్షన్లు ఎంత అనేది చెప్పడం కష్టం. కాగా, ఆయన తొలి పారితోషికం అయిదువేలు. చివరి దశలో పాతిక లక్షల వరకు తీసుకున్నారు. ఆయన ఆఖరు చిత్రానికి కోటి రూపాయలు పారితోషికం అందిందని సమాచారం. ఎన్టీఆర్​ ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ. సినిమా రంగంలో వున్నప్పుడూ అంతే, రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత అంతే! ఆయన ఎక్కడుంటే అక్కడ ఒక మహాకాంతివలయం కదులుతూ కనిపించేది. కృషిని నమ్ముకున్న రైతుబిడ్డ ఆయన. కళాకారుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన పట్టిందల్లా బంగారం అయింది. రాశిలోనే కాదు వాశిలోనూ సినిమాలలో ఆయనది అగ్రస్థానమే! ఆయనది ఎప్పటికీ నంబర్ వన్ స్థానమే!

ఆయన నటించినన్ని పౌరాణిక చిత్రాలు ప్రపంచంలో మరే ఇతర నటుడూ నటించలేదేమో! ఒక రాముడిగా, ఒక కృష్ణునిగా, కలియుగదైవం వెంకటేశ్వరునిగా సాక్షాత్తూ ఆపర భగవంతునిగా తెలుగు ప్రజలు ఆరాధించే ఎన్.టి.ఆర్. మొత్తం 43 పౌరాణిక చిత్రాలలో నటించారు. ఒకే సినిమాలో నాయక ప్రతినాయక పాత్రలు ధరించిన ఘనత ఆయనది. ఆయన నటించిన మిగతా సినిమాలలో 12 చారిత్రక చిత్రాలు, 55 జానపదాలు కాగా 185 సాంఘికాలు. వీటిలో సగానికి పైగా అంటే 141 చిత్రాలు శతదినోత్సవాలు కాని రజతోత్సవాలు కాని జరుపుకున్నాయి. ఆరు సినిమాలు స్వర్ణోత్సవాలు జరుపుకోగా లవకుశ చిత్రం ఏకబిగిన 75 వారాలు ఆడి రికార్డు సృష్టించింది.

ఇదీ చూడండి: పాన్‌ ఇండియా సినిమాలపై కమల్​ ఆసక్తికర కామెంట్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.