ETV Bharat / entertainment

ఆ​ నటితో నాలుగో పెళ్లి!.. నరేశ్​ ఆసక్తికర వ్యాఖ్యలు - Senior actor Naresh fourth marriage

Senior Actor Naresh Marriage: సీనియర్​ నటుడు నరేశ్ త్వరలోనే నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం సాగుతోంది. ఓ సీనియర్​ నటిని ఆయన వివాహం చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లిపై ఆయన స్పందించారు. ఏమన్నారంటే..

Senior actor Naresh Pavitra fourth marriage
నరేశ్ పవిత్ర పెళ్లి
author img

By

Published : Jun 23, 2022, 12:34 PM IST

Updated : Jun 23, 2022, 1:07 PM IST

Senior Actor Naresh Marriage: సీనియర్​ నటుడు నరేశ్​.. క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా వరుస సినిమాలు చేస్తూ కెరీర్​లో ఫుల్​ బిజీగా గడుపుతున్నారు. అయితే ఇప్పటికే మూడుసార్లు విడాకులు తీసుకున్న ఆయన.. గత కొంతకాలంగా నాలుగో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ సీనియర్ నటిని వివాహం చేసుకోనున్నారని, ప్రస్తుతం వారిద్దరు సహజీవనం చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్​లో పెళ్లి వ్యవస్థ ఉండకపోవచ్చని అన్నారు.

"సినిమా వాళ్ల పెళ్లిల్లు బయటికి కనిపిస్తాయి, మిగతా వాళ్ళవి కనిపించవు. పెళ్లి అనేది ఆట కాదు. అది ఒక జీవితం. లైఫ్​లో ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తే అందులో నుంచి బయటకు వస్తారు. ఒకప్పుడు ఒక్క ఫ్యామిలీ కోర్టు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు 8 ఫ్యామిలీ కోర్టులు వచ్చాయి. ఒకప్పుడు భర్త సంపాదించి తెస్తే.. భార్య ఇంటి పనులు, పిల్లల్ని, పెద్దల్ని చూసుకుంటూ ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఆమె కూడా సంపాదిస్తుంది. సొంతంగా సెల్ ఫోన్ కొనుక్కుంటుంది.. ఆమెకు ఫ్రెండ్స్ ఉంటున్నారు.. సొంత లైఫ్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో భార్యభర్తలు త్వరగా విడిపోతున్నారు. భవిష్యత్​లో మ్యారేజ్​ వ్యవస్థ ఉండకపోవచ్చు. ఓ నటుడికి స్థిరత్వం ఉందడు. సమయానికి ఇంటికి రారు. నేను నెలలో 28 రోజులు షూటింగ్​లలో ఉంటాను. ఇప్పటికీ నా మొదటి భార్య సినిమానే. నా వృత్తి జీవితాన్ని అర్థం చేసుకునే వారితోనే కలిసి జీవించగలను" అని నరేశ్ అన్నారు.

ఇదీ చూడండి: 'స్ట్రైక్​ కరెక్ట్​ కాదు.. సినీకార్మికుల కోసం ఏదైనా చేసేందుకు సిద్ధం'

Last Updated : Jun 23, 2022, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.