ETV Bharat / entertainment

'బింబిసార' నుంచి మరో కొత్త పాట.. ఆసక్తిరేపుతున్న 'కృష్ణమ్మ' ట్రైలర్​ - Karthi Viruman Trailer

లేటెస్ట్​ సినిమా​ అప్డేట్లు వచ్చేశాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న 'బింబిసార'లోని విజయహో పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. మరోవైపు హీరోలు సత్యదేవ్, కార్తీ కొత్త సినిమా ట్రైలర్లు కూడా రిలీజయ్యాయి.

movie updates
movie updates
author img

By

Published : Aug 4, 2022, 3:05 PM IST

Satyadev Krishnamma Movie Trailer Released: న‌ట‌నకు ప్రాధాన్యమున్న పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ ఇటు హీరోగా అటు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్​గా సినీరంగంలో దూసుకుపోతున్న న‌టుడు స‌త్య‌దేవ్‌. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడ‌ుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక‌ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'కృష్ణమ్మ'. వి.వి గోపాలకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ చిత్ర ట్రైల‌ర్‌ను హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ గురువారం విడుద‌ల చేశారు. స‌త్య‌దేవ్‌ సరసన హీరోయిన్​ అతిరా రాజ్​ న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ స‌మ‌ర్పిస్తున్న ఈ సినిమాని కృష్ణ కొమ్మ‌ల‌పాటి నిర్మిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Bimbisara Vijayaho Song: హీరో నందమూరి కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం 'బింబిసార'. వశిష్ఠ.. దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచారాన్ని మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌, పాటలను పంచుకోగా ఇప్పుడు మరో పాటను విడుదల చేసింది. సంగీత దర్శకుడు కీరవాణి, చైతన్య ప్రసాద్ రాసిన పవర్​ఫుల్​ 'విజయహో' సాంగ్​ను మేకర్స్​ గురువారం రిలీజ్​ చేశారు. ఈ సినిమాలో సంయుక్తా మేనన్‌, కేథరిన్‌ హీరోయిన్లుగా నటించారు.

Karthi Viruman Trailer: తమిళ హీరో కార్తీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. 'యుగానికి ఒక్క‌డు' సినిమా నుంచి గ‌తేడాది విడుద‌లైన 'సుల్తాన్' వ‌ర‌కు ఆయ‌న ప్ర‌తి సినిమా త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏక‌కాలంలో విడుద‌ల‌వుతూ వ‌స్తున్నాయి. తాజాగా కార్తీ నటించిన చిత్రం 'విరుమ‌న్'. ముత్త‌య్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో దిగ్గ‌జ‌ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కూతురు అధితి హీరోయిన్‌గా న‌టించారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. 2డీ ఎంట‌ర్టైన‌మెంట్స్ ప‌తాకంపై సూర్య, జ్యోతిక ఈ మూవీని నిర్మించారు.

ఇవీ చదవండి: 'సంయుక్తా.. ఆ రోజు తారక్‌తో ఏం మాట్లాడారు?'

'స్కామ్ 1992' నటుడు కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.