ETV Bharat / entertainment

'పవన్​కల్యాణ్​ను దృష్టిలో పెట్టుకునే 'గాడ్సే''

author img

By

Published : Jun 15, 2022, 7:21 AM IST

Satyadev Godsey movie: పవర్​స్టార్​ పవన్‌ కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకొని 'గాడ్సే' కథను సిద్ధం చేసినట్లు తెలిపారు గోపి గణేష్‌ పట్టాభి. ఈ చిత్రం పవన్‌కు చూపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. సమాజంలో జరిగే అన్యాయాన్ని ఈ మూవీలో చూపించినట్లు తెలిపారు.

godsey
గాడ్సే

Satyadev Godsey movie: "నా దృష్టిలో కళ్లు ఉండీ వాస్తవాన్ని చూడలేని వాడే నిజమైన గుడ్డోడు. చెవులుండీ నిజాన్ని గ్రహించలేని వాడే అసలైన చెవిటోడు. గొంతుండీ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేని వాడే మూగోడు.... ఇలాంటి వారందరినీ ప్రతిబింబిస్తూ.. పోరాటం చేసేవాడే మా గాడ్సే" అన్నారు గోపి గణేష్‌ పట్టాభి. ఆయన దర్శకత్వంలో సత్యదేవ్‌ హీరోగా నటించిన చిత్రమే 'గాడ్సే'. ఈనెల 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విలేకర్లతో ముచ్చటించారు గోపి గణేష్‌. ఆ సంగతులివీ..

"బ్లఫ్‌మాస్టర్‌ తర్వాత నేను.. సత్యదేవ్‌ కలిసి చేసిన రెండో చిత్రమిది. మన దేశంలో 6.3శాతం మందే చదివిన చదువుకు తగ్గ అర్హత కలిగిన ఉద్యోగం చేస్తున్నారు. మిగిలిన 93.7శాతం మంది వాళ్ల చదువుకు సంబంధం లేని ఉద్యోగాలే చేస్తున్నారు. పాతికేళ్లు కష్టపడి చదివిన చదువు.. మనకు ఆ తర్వాత పాతికేళ్లకు ఎందుకూ ఉపయోగపడకపోతే 25ఏళ్ల జీవితం, శ్రమ వృథా అయినట్లే కదా. 'ప్రతి ఎన్నికలకు ముందు 2-3లక్షల ఉద్యోగాలిస్తామంటూ మభ్య పెట్టి.. ఆ నిరుద్యోగుల ఓట్లతో రాజకీయ నిరుద్యోగులొచ్చి అధికారంలో కూర్చుంటున్నార'ని సినిమాలో ఓ డైలాగ్‌ ఉంది. అది నిజంగానే జరుగుతోంది. మనం చూస్తూనే ఉన్నాం. ఎవరం ప్రశ్నించం. ఇలా అందరి మనసుల్లో ఉన్న ప్రశ్నలను 'గాడ్సే' ప్రశ్నిస్తాడు".●

"దర్శకులు టి.కృష్ణ, శంకర్‌, మణిరత్నం అంటే నాకెంతో ఇష్టం. నాపై వాళ్ల ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. నేను తీసే సినిమాలు ప్రేక్షకుల్ని ఒక్కరోజు ఆలోచింపజేసినా చాలు.. నాకది చాలా సంతృప్తినిస్తుంది. ప్రస్తుతం సత్యదేవ్‌తో మరో సినిమా పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నా. మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లా ఉంటుంది. 'బ్లఫ్‌మాస్టర్‌2' చేయాలన్న ఆలోచన ఉంది".

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అందుకే ఆ పేరు.. "ఈ చిత్రానికీ.. నాథూరామ్‌ గాడ్సే జీవిత కథకు ఎలాంటి సంబంధం లేదు. సినిమాలో ఓ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ ఉంటుంది. హీరో ఇంటర్‌ చదివే రోజుల్లో కాలేజీలో ఓ నాటిక వేస్తాడు. దాంట్లో తను గాడ్సే పాత్ర పోషిస్తాడు. ఆ నాటిక చివర్లో బొమ్మ తుపాకీతో గాంధీ పాత్రధారిని కాల్చాల్సి ఉన్నా.. ఆ పని చేయడు. ‘ఐ లవ్‌ గాంధీ. నేను కాల్చన’ని చెబుతాడు. అలాంటి కుర్రాడు.. పెద్దయ్యాక నిజం గన్స్‌ పట్టుకొని కొంతమందిని ఎందుకు కాల్చి చంపాడు? అతనలా ఆయుధం చేతబట్టడానికి కారణాలేంటి? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. పవన్‌ కల్యాణ్‌ని దృష్టిలో పెట్టుకొని సిద్ధం చేసిన కథ ఇది. ఆయనకు చెప్పే అవకాశం రాలేదు. ఈ చిత్రం పవన్‌కు చూపించే ప్రయత్నం చేస్తున్నాం".

ఇదీ చూడండి: గతజన్మలో అక్కడే పుట్టానేమో!: సాయిపల్లవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.