Sapta Sagaralu Dhaati Side B Movie : కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నటించిన 'సప్త సాగరాలు దాటి - సైడ్ బి' శుక్రవారం (నవంబర్ 17న) విడుదల కానుంది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తోంది. ఇప్పటికే మూవీ మేకర్స్ విడుదల చేసిన టీజర్, ట్రైలర్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
'సప్త సాగరాలు దాటి - సైడ్ ఏ' తెలుగులో సెప్టెంబర్‌లో విడలైంది. ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో వసూళ్లు మాత్రం రాలేదు. ఓటీటీలో విడదల చేశాకే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కథ, పాత్రలు, వారి భావోద్వేగాలకు ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ క్రమంలో 'సప్త సాగరాలు దాటి - సైడ్ బి'ని థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు వస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ సారి ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వస్తాయని.. అలానే టికెట్ రేట్లు తగ్గించినట్లు మూవీ మేకర్స్ తెలిపారు.
అయితే శుక్రవారం విడుదల అవుతున్న ఈ సినిమాకు తెలుగులో గట్టి పోటీ ఉంది. అదే రోజున హీరోయిన్ పాయల్, దర్శకుడు అజయ్ భూపతి 'మంగళవారం' సినిమా కూడా విడుదల కానుంది. దీంతో పాటు 'స్పార్క్', 'మై నేమ్ ఈజ్ శృతి' సినిమాలు కూడా థియేటర్లలోకి రానున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సినిమా మొదటి భాగంలో మను, ప్రియల ప్రేమకథ లవ్ స్టోరీని ప్రధానంగా తీసుకున్నారు. పెళ్లి, సముద్రతీరంలో ఇళ్లు ఇలా ఎన్నో కలలతో ఉన్న ఓ ప్రేమ జంట.. హీరో తీసుకునే ఓ తప్పుడు నిర్ణయం వల్ల వారి జీవితాల్లో పెను మార్పులు జరుగుతాయి. వాటిని డైరెక్టర్ హేమంత్ రావ్ ఎంతో అందంగా మలిచాడు. దీంతో ఫ్యాన్స్ ఈ సింపుల్ లవ్ స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యారు. ఈ క్రమంలో సెకెండ్ పార్ట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్లో రెండవ భాగానికి సంబంధించిన స్టోరీని టూకీగా చెప్పారు డైెరెక్టర్. జైలు నుంచి మను విడుదలైన తర్వాత అతని జీవితం ఎలా సాగుతుంది. తనకు జరిగిన అన్యాయానికి రివెంజ్ తీసుకుంటున్న మను.. ప్రియను మరిచిపోలేకుండా ఉండటం..అతడి జీవితంలోకి ఇంకో అమ్మాయి రావడం ఇలా కొంత యాక్షన్‌తో పాటు లవ్ ఎలిమెంట్స్ సెకెండ్ పార్ట్‌లో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో ఫ్యాన్స్ సైడ్ బి కి బాగా కనెక్ట్ అవుతారని మేకర్స్ ఆశిస్తున్నారు.
వైలన్స్ మోడ్‌లో రక్షిత్ - 'సప్త సాగరాలు దాటి సైడ్-బి' ట్రైలర్ చూశారా ?
Sapta Sagaralu Dhaati Teaser : మనసును తాకేలా ఆమె మాటలు.. ఆ రోజే థియేటర్లలోకి సీక్వెల్