ETV Bharat / entertainment

ప్రభాస్​, మారుతి సినిమాలో సంజయ్​ దత్​.. ఏ పాత్ర చేయబోతున్నాడో తెలుసా?

author img

By

Published : Dec 19, 2022, 10:43 PM IST

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​, దర్శకుడు మారుతి చిత్రం నుంచి మరో అప్డేట్​ వచ్చింది. ప్రముఖ బాలీవుడ్​ నటుడు సంజయ్​ దత్​ ఈ సినిమాలో ఓ కీలక రోల్​ చేయబోతున్నారు. ఆ ప్రత్యేకమైన పాత్ర ఏంటో తెలుసా..

prabhas maruthi movie
prabhas maruthi movie

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవలే దర్శకుడు మారుతితో ఓ చిత్రాన్ని ప్రకటించారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్​ దిగ్గజ నటుడు సంజయ్​ దత్​ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్​ వచ్చింది. సంజయ్​ దత్​ ఈ సినిమాలో ప్రభాస్​కు తాతగా నటించబోతున్నారట. ఆయన త్వరలోనే షూటింగ్‌లో కూడా పాల్గొననున్నారు.

కాగా, ఈ సినిమాను మారుతి హారర్ కామెడీగా రూపొందిస్తున్నాడు. అందులో భాగంగానే.. ఓ కీలక రోల్ కోసం మేకర్స్ సంజయ్ దత్‌ను ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇక సంజయ్ దత్‌ అనగానే అందరూ విలన్ రోల్ అయ్యింటుందని అనుకుంటారు. కానీ ఇందులో ప్రభాస్‌కు తాతగా సంజయ్ నటిస్తుడంటం గమనార్హం. అయితే ఈ పాత్రకు కూడా ఏదో స్పెషాలిటీ ఉంటుందని సినీ వర్గాల్లో టాక్​ వినిపిస్తోంది. కాగా, దీనిపై నెట్టింట్లో చర్చ జరుగుతోంది.

మారుతి ఎలాంటి కథను ఎంచుకున్నా.. అందులో కామెడీ కచ్చితంగా ఉంటుంది. ఇకపోతే సంజయ్ దత్​ కూడా హిందీలో మున్నాభాయ్ సినిమాలతో కామెడీ ఇరగదీశాడు. దీంతో వీరిద్దరూ కలిస్తే కామెడీ కుమ్మేస్తారని ఫ్యాన్స్ ఫుల్​ ఖుషీ అవుతున్నారు. ఇక సీరియస్ చిత్రాల్లో నటిస్తున్న ప్రభాస్‌కు సైతం ఈ సినిమా రిలీఫ్‌గా ఉంటుందని భావిస్తున్నారు. తెలుగులో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తర్వాత పలు భాషల్లోకి అనువదించి విడుదల చేయనున్నారని సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.