ETV Bharat / entertainment

Sampoornesh Babu New Movie : చాలా గ్యాప్ తర్వాత స్క్రీన్​పైకి.. ఇంట్రెస్టింగ్​గా 'మార్టిన్ లుథర్​ కింగ్'​ పోస్టర్​ - మార్టిన్ లూథర్ కింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

Sampoornesh Babu New Movie : కమెడియన్ హీరో సంపూర్ణేశ్ బాబు చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సారి ఆయన మార్టిన్ లుథర్ కింగ్​గా రాబోతున్నారు. ఆ వివరాలు..

Sampoornesh Babu New Movie : చాలా గ్యాప్ తర్వాత స్క్రీన్​పైకి సంపూర్ణేశ్​ బాబు.. మార్టిన్ లుథర్​ కింగ్​గా

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2023, 12:35 PM IST

Sampoornesh Babu New Movie : హృద‌య‌కాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట సినిమాలతో తెలుగు ఆడియెన్స్​ను ఆకట్టుకున్న కమెడియన్ హీరో సంపూర్ణేశ్ బాబు తెరపై కనిపించి చాలా రోజులే అయింది. కెరీర్ ప్రారంభంలో స్ఫూఫ్ కామెడీ చిత్రాలతో క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి స‌క్సెస్​లను అందుకున్న ఆయన.. ఆ తర్వాత పేసరట్టు, సింగం 123, కొబ్బరి మట్ట, క్యాలి ఫ్లవర్​.. ఇంకా ఎన్నో చిత్రాలను చేశారు. కానీ మంచి హిట్​ అందుకోలేకపోయారు.

ఇప్పుడు చాలా విరామం త‌ర్వాత ఓ పొలిటిక‌ల్ కామెడీ సినిమాతో సంపూర్ణేశ్​ బాబు రానున్నారు. ఈ చిత్రానికి మార్టిన్ లూథ‌ర్ కింగ్(Martin Luther King) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసింది మూవీ టీమ్​. టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌ లుక్ పోస్ట‌ర్‌ను సోషల్ మీడియాలో వేదికగా రిలీజ్​ చేసింది. ఇందులో సంపూర్ణేశ్​ బాబు త‌ల‌పై ఓ భారీ కిరీటం పెట్టుకుని కనిపించారు. అయితే ఆ కిరీటంలో కొంత‌మంది నాయ‌కులు ఓట్ల కోసం ప్ర‌చారం చేస్తున్న‌ట్లుగా కనిపంచారు. డిఫరెంట్​గా డిజైన చేసిన ఈ పోస్టర్​ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో సంపూర్ణేశ్​ బాబుతో పాటు దర్శకుడు వెంక‌టేష్ మ‌హా, న‌రేశ్ కూడా కనిపించనున్నారు. ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాను అక్టోబ‌ర్ 27న థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మూవీ టీమ్​ పోస్టర్ ద్వారా తెలిపింది.

కోలీవుడ్ చిత్రానికి రీమేక్​గా.. ఈ సినిమా ఓ కోలీవుడ్ హిట్​ చిత్రానికి రీమేక్ అని అంటున్నారు. త‌మిళంలో ప్రముఖ కమెడియన్ యోగిబాబు లీడ్ రోల్​లో యాక్ట్ చేసిన మండేలా చిత్రానికి రీమేక్ అని చెబుతున్నారు. ఈ సినిమా ఆస్కార్ అవార్డ్​ కోసం బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేట‌గిరీలో.. ఇండియా నుంచి షార్ట్‌లిస్ట్ అయింది. కానీ ఫైనల్​ నామినేష‌న్స్​లో మాత్రం చోటు ద‌క్క‌ించుకోలేకపోయింది. కానీ రెండు జాతీయ అవార్డులను మాత్రం అందుకుంది. మరి ఎప్పుడో చివరిసారిగా 2021లో క్యాలిఫ్లవర్​ చిత్రంతో వచ్చిన సంపూర్ణేశ్​.. ఇప్పుడు దాదాపు రెండేళ్లు గ్యాప్ ఇచ్చి రానున్నారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో, సంపూర్ణేశ్​ మంచి హిట్ ఇస్తుందో లేదో చూడాలి..

Vijay Antonys Daughter Suicide : షాకింగ్​.. హీరో విజయ్‌ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య.. అసలేమైంది?

Rajamouli New Film : 'మేడ్​ ఇన్​ ఇండియా'.. జక్కన్న బిగ్​ అనౌన్స్​మెంట్​ పూర్తి వివరాలివే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.