ETV Bharat / entertainment

ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​​.. 'శాకుంతలం' కొత్త రిలీజ్​ డేట్​ ఇదే..! - శాకుంతలం మూవీ హీరో

ఇప్పటికే 'శాకుంతలం' మూవీ వాయిదా పడిందని నిరాశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్​కు తీపి కబురు అందించింది చిత్ర బృందం​. శుక్రవారం ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఇంతకీ రిలీజ్ ఎప్పుడంటే?

shaakuntalam
shaakuntalam
author img

By

Published : Feb 10, 2023, 3:30 PM IST

Updated : Feb 10, 2023, 4:01 PM IST

స్టార్​ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో.. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కించిన ప్రేమకావ్యం 'శాకుంతలం'. ఇప్పటికే ఈ మూవీ ఫిబ్రవరి 17న రిలీజ్​ అవుతుందని చిత్ర బృందం అనౌన్స్​ చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. కాగా, ఇప్పుడు ఈ సినిమా ఏప్రిల్​ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని ట్విట్టర్​ వేదికగా చిత్ర బృందం ప్రకటించింది. దీంతో సామ్ ఫ్యాన్స్​ ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు.

కాగా, సమంత నటించిన తొలి మైథలాజికల్​ మూవీ 'శాకుంతలం'. గుణశేఖర్​ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్​ సినిమాలో సామ్​ సరసన దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్​ మోహన్​ నటించారు. అంతే కాకుండా ఇందులో మోహన్​ బాబు, మధుబాల, కృష్ణం రాజు వంటి అగ్ర తారలు కీలక పాత్ర పోషించారు.

Last Updated : Feb 10, 2023, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.