ETV Bharat / entertainment

'హిట్'​ ఫ్రాంచైజీలో నటించమని అడివిశేష్​ రిక్వెస్ట్​.. సమంత సూపర్​ రిప్లై! - samantha praises hit movie

హిట్​ ఫ్రాంచైజీలో నటించమని హీరోయిన్​ సమంతను రిక్వెస్ట్​ చేశారు హీరో అడివిశేష్​! అందుకు సామ్​ ఏమని చెప్పారంటే..

Samantha reply to Adavisesh HIT movie franchise
హిట్​ ఫ్రాంచైజీలో సమంత
author img

By

Published : Dec 3, 2022, 12:01 PM IST

అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హిట్‌ 2. నేచురల్‌ స్టార్‌ నాని సమర్పణలో రూపొందిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీకి శైలేష్‌ కొలను దర్శకత్వం వహించారు. డిసెంబరు 2న విడుదలైన ఈ చిత్రం సూపర్​ హిట్ టాక్​ను దక్కించుకుంది.

అయితే ఈ హిట్ ఫ్రాంచైజీని ఏడు భాగాలుగా తీసుకురావాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాని తెలిపారు. చెప్పినట్లుగానే హిట్‌ 2లోనే మూడో భాగంలో ఎవరు నటించనున్నారనే విషయాన్ని క్లారిటీ ఇచ్చేశారు. నాని హీరోగా అడివి శేష్‌ కీలక పాత్రలో నటించనున్నారని వెల్లడించారు.

ఇక ఈ హిట్‌ ఫ్రాంచైజీలో సమంతను మెయిన్‌ లీడ్‌గా తీసుకుంటే ఎలా ఉంటుంది? అనే ఓ ప్రశ్న హీరో అడివి శేష్​కు ఎదురైంది. దీనికి అడివి శేష్‌ స్పందిస్తూ.. ఐడియా అదిరిపోయింది, మరి ఏమంటావ్‌ సామ్‌ అంటూ సమంతను ట్యాగ్‌ చేశారు. దీనికి సామ్‌ స్పందిస్తూ.. 'ఓ రౌడీ పోలీస్‌.. ఆలోచన బాగుంది. ముందుగా సూపర్‌ హిట్‌ అందుకున్నందుకు అడివి శేష్‌కు శుభాకాంక్షలు' అని ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఆలోచన బాగుందన్న సామ్‌ మరి హిట్‌ యూనివర్స్‌లో భాగమవుతుందా? లేదా? చూడాలి!

Samantha reply to Adavisesh HIT movie franchise
హిట్​ ఫ్రాంచైజీపై సమంత కామెంట్స్​

ఇదీ చూడండి: మెహందీ వేడుకలో భర్తతో కలిసి చిందులేసిన హన్సిక ఎంత అందంగా ఉందో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.