samantha kushi songs : విజయ్ దేవరకొండ - సమంత నటించిన లవ్ అండ్ రొమాంటిక్ ఫిల్మ్ 'ఖుషి'. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే 'నా రోజా నువ్వే' సాంగ్ సోషల్‌మీడియాలో మ్యూజిల్ లవర్స్‌ను ఆకట్టుకుంటూ ఫుల్ ట్రెండ్ అవుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ 'ఆరాధ్య' రిలీజై ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో సామ్-విజయ్ కెమిస్ట్రీ యూత్‌ను ఆకట్టుకుంటోంది. హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలు, లిరిక్స్, మ్యూజిక్ అన్నీ చాలా బాగున్నాయి. అయితే ఈ సెకండ్ సాంగ్ వల్ల సామ్‌కు ఓ చిన్న తలనొప్పి వచ్చి పడింది!. ఇందులో విజయ్‌తో కలిసి నటించిన ఓ సన్నివేశం సామ్‌ను ట్రోలింగ్‌కు గురి చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆ ట్వీట్ వల్లే ఇలా.. ఈ 'ఆరాధ్య' సాంగ్‌లో విజయ్ దేవరకొండ సోఫాలో పడుకుని.. సమంత కుడి చేతిని తన కాలితో టచ్ చేస్తున్నట్లు కనిపించారు. ఇప్పుడు దీన్ని చూసిన కొందరు సోషల్‌మీడియా యూజర్స్.. సామ్ గతంలో ఓ సినిమాపై చేసిన ట్వీట్‌ను బయటకు వెతికి తీశారు. అందులో.. 'ఇంకా రిలీజ్ అవ్వనీ ఓ మూవీ పోస్టర్ చూశాను. అది చూడంగానే నా మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి' అని వ్యాఖ్య రాసుకొచ్చింది.
అయితే అది మహేశ్ '1 నేనొక్కడినే' సినిమాకు సంబంధించిన పోస్టర్ అని అప్పట్లో చాలా మంది అన్నారు. అందులో మహేశ్ బీచ్‌లో నడుస్తుండగా.. ఆయనే వెనకే హీరోయిన్ మోకాలి మీదు పాకుతూ కనిపిస్తుంది. దాన్ని ఉద్దేశించే సామ్ అలా ట్వీట్ పెట్టిందని అన్నారు. ఇప్పుడు ఆ పోస్టర్‌ను-'ఖుషి' సెకండ్ సింగిల్ ఆ స్టిల్‌ను పక్కపక్కన జోడించి ట్రోల్ చేస్తున్నారు.
ఇకపోతే సమంత చేతిలో ప్రస్తుతం 'ఖుషి' చిత్రంతో పాటు.. 'సిటాడెల్' ఇండియన్ వెబ్‌సిరీస్ ఉంది. సిటాడెల్ షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే తన ఆరోగ్యంపై పూర్తి దృష్టి సారించేందుకు ఏడాది పాటు బ్రేక్ తీసుకోవాలని సామ్ భావించినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకోసం విదేశాలకు వెళ్లనుందని అంటున్నారు.
-
No Hate But Sorry #Samantha
— Nikhil_Prince💫 (@Nikhil_Prince01) July 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Karma Hits Back 🍌 pic.twitter.com/eTKTk3NQo8
">No Hate But Sorry #Samantha
— Nikhil_Prince💫 (@Nikhil_Prince01) July 12, 2023
Karma Hits Back 🍌 pic.twitter.com/eTKTk3NQo8No Hate But Sorry #Samantha
— Nikhil_Prince💫 (@Nikhil_Prince01) July 12, 2023
Karma Hits Back 🍌 pic.twitter.com/eTKTk3NQo8
Samantha Break from movies : మయోసైటీస్ కారణంగా.. సమంత కొంతకాలంగా మయోసిటీస్ అనే వ్యాధితో బాధపడుతోంది. ఈ కారణంగానే ఆ మధ్యలో కొంత కాలం పాటు షూటింగ్‌లకు బ్రేక్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత చికిత్స కొనసాగిస్తూనే మళ్లీ షూటింగ్లలో పాల్గొంది. ఇప్పుడు ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకునేందుకే ఏడాది పాటు బ్రేక్ తీసుకుని విదేశాలకు వెళ్లి పూర్తి చికిత్స తీసుకోబోతుందట. అయితే ఈ అనారోగ్యం కారణంగా.. 'ఖుషి' ప్రమోషన్స్‌లో ఆమె ఫుల్ యాక్టివ్‌గా పాల్గొనదని బయట కథనాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని మూవీటీమ్‌కు చెప్పిందట. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు.. లైగర్ డిజాస్టర్‌తో దెబ్బ తిన్న విజయ్‌పై ప్రమోషన్స్‌కు సంబంధించి పూర్తి బాధ్యతలు వేయడం సరికాదని.. కాస్త సమంతానే ఎలాగోలా అడ్జెస్ట్ చేసుకుని హెల్ప్ చేయాలని సూచిస్తున్నారు. ఇంకొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి సామ్.. విజయ్‌కు మధ్యలోనే హ్యాండ్ ఇచ్చిందా అని కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తున్నారని బయట ప్రచారం సాగుతోంది. మరి సమంత ఏడాది పాటు బ్రేక్ ఇస్తుందో లేదో, ప్రమోషన్స్‌లో పాల్గొంటుందో లేదో చూడాలి. ఇకపోతే 'ఖుషి' చిత్రం సెప్టెంబరు 1న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. సినిమా మ్యూజికల్ హిట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఇదీ చూడండి :
మెలోడియస్గా 'ఖుషి' సెకెండ్ సింగిల్.. సామ్-విజయ్ కెమిస్ట్రీ అదుర్స్