Samantha Gym Trainer : సౌత్ ఇండస్ట్రీ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు కొంచెం విరామం ప్రకటించి ఆరోగ్యంపై పూర్తి ఫోకస్ పెట్టింది. వెకేషన్లు, హాస్పిటల్ అంటూ బిజీగా గడుపుతోంది. వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేస్తోంది.
అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు వచ్చిన ఓ మెసేజ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ నెట్టింట వైరల్‌గా మారింది. దానిని సమంతనే తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. సామ్ జిమ్ ట్రైనర్ జునైద్ షేక్ నుంచి వచ్చిన మెసేజ్ అది. శనివారం రాత్రి.. 11 గంటల సమయంలో జిమ్‌కు సంబంధించిన 'చేద్దామా' అంటూ అతడు గుర్తు చేశాడు. దీనికి సామ్.. ఆదివారం పొద్దునే.. 'నాకు బాడీ పెయిన్స్గా ఉన్నాయి. ఇవాళ రెస్ట్ తీసుకుంటాను' అని బదులిచ్చింది. దానికి అతడు 'నేను ఇక్కడే ఉన్నానంటూ' బదులిచ్చాడు. అంటే అప్పటికే అతడు జిమ్‌కు వచ్చినట్లు చెప్పాడు. దీంతో చేసేదేమిలేక.. జిమ్ సెషన్లో పాల్గొంది సామ్.
రెండో పిక్‌లో పింక్ కలర్ టైట్ ఫిట్ జిమ్ వేర్ డ్రెస్‌లో ఫ్రంట్ వ్యూలో పుల్ అప్స్ చేస్తూ హాట్‌గా కనిపించింది సమంత. 'మరో దారుణమైన సండే' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. అంటే ఆదివారం రెస్ట్ తీసుకుందామని సామ్ భావిస్తే.. తన జిమ్ ట్రైనర్ వదలడం లేదన్నట్టుగా చెప్పుకొచ్చింది. వీటికి సంబంధించిన పిక్స్‌నే ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్‌గా మారాయి.
Samantha Upcoming Movies : ఇకపోతే సమంత ఇటీవలే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి' సినిమాతో ఆడియెన్స్‌ను అలరించింది. ఈ చిత్రం మిశ్రమ స్పందనలను అందుకుంది. త్వరలోనే ఆమె రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో నటించిన 'సిటాడెల్' ఇండియన్ వెర్షన్ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బ్రేక్ పూర్తైన తర్వాత బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌తో ఓ మూవీ చేయబోతున్నట్లు గత కొద్ది రోజులుగా కథనాలు వస్తున్నాయి.
Samantha Health Condition : హాస్పిటల్‌కు సమంత.. అలా చేస్తేనే తనకు శక్తి పెరుగుతుందంటూ పోస్ట్
Samantha Tattoo : సమంత ఒంటిపై ఆ టాటూ మిస్సింగ్.. అసలు ఏం జరిగిందంటే?