బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన కొత్త చిత్రం 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్'. ఫర్హాద్ సమ్‌జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈద్ కానుకగా భారీ అంచనాలతో రిలీజైంది. అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడియెన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. ఫస్ట్ డే నుంచి నెగటివ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ విషయంలో ఓపెనింగ్స్ అంతగా రాలేదు. బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. తొలి రోజు కేవలం రూ.15 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అయితే ఇప్పడీ చిత్రం క్రమక్రమంగా వసూళ్ల విషయంలో పుంజుకుంటోంది. సల్మాన్ మాస్ ఇమేజ్‌తో కలెక్షన్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి.
రెండో రోజు ఊహించని విధంగా రూ.25.75 కోట్లు కలెక్ట్ చేసిందట. మూడో రోజు రూ.68.17 కోట్లు కలెక్ట్ చేసింది తెలిసింది. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. మాస్ ఆడియెన్స్‌తో ఈ మూవీ కొన్ని ప్రాంతాల్లో సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతున్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ సినిమా సల్మాన్ భాయ్ హోంబ్యానర్ సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ బ్యానర్‌లో తెరకెక్కింది. తాజాగా ఈ బ్యానర్ తమ అధికార ట్విటర్లోనూ కలెక్షన్స్ వివరాలను తెలిపింది. మొత్తం వరల్డ్‌వైడ్‌గా 112.80కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్వీట్ చేసింది. దీంతో సల్మాన్ భాయ్ అభిమానులు కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో కలెక్షన్లలో మరింత గ్రోత్ కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్, జగపతి బాబు, భూమికా చావ్లా, భాగ్యశ్రీ, మాళవికా శర్మ కీలక పాత్రలు పోషించారు.
ఇకపోతే ఈ సినిమాకు నేపథ్య సంగీతం రవి బస్రూర్ అందించారు. హిమేశ్ రేష్మియా, షాజిద్ ఖాన్, దేవిశ్రీ ప్రసాద్ తదితరులు పాటలు ఆలపించారు. వి.మణికందన్ సినిమాటోగ్రఫీ అందించగా.. మయూరేష్ సావంత్ ఎడిటర్‌గా వ్యవహరించారు. సల్మాన్‌ఖాన్ నిర్మాత. తమిళంలో స్టార్ హీరో అజిత్ నటించిన 'వీరమ్'కు రీమేక్‌గా రూపొందిందీ చిత్రం. తెలుగులో ఇదే చిత్రాన్ని 'కాటమరాయుడు'గా పవన్‌కల్యాణ్ తీశారు. కానీ అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మొత్తంగా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ రివ్యూ విషయానికొస్తే.. సల్మాన్‌ఖాన్, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు బలం. రీమేక్ కథ కావడం, ద్వితీయార్ధం, పతాక సన్నివేశాలు చిత్రానికి బలహీనతలుగా నిలిచాయి. ఒక్కమాటలో.. వీరమ్-కాటమరాయుడు-సల్మాన్‌ను కలిపితే కిసీ కా భాయ్ కిసీ కి జాన్.
ఇదీ చూడండి: 'వీరమల్లు' విషయంలో సైలెంట్‌గా పవన్ ఫ్యాన్స్!