Salaar Ugramm Remake : యావత్ దేశ సినీ ప్రియులు మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో ప్రభాస్ 'సలార్' ఒకటి. ఈ చిత్రాన్ని కేజీయఫ్ ఫేమ్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు . అయితే ఈ భారీ యాక్షన్ ఎంటర్ సినిమా గతంలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఉగ్రం సినిమాకు రీమేక్ అని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
వివరాళ్లోకి వెళితే.. స్టార్ హీరోల సినిమాల విషయంలో సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు విషయం క్లారిటీ అయ్యేలోగా.. క్షణాల్లో రూమర్స్ వైరల్ అయిపోతుంటాయి. సలార్ కొత్త రిలీజ్ డేట్.. డిసెంబర్ 22 అని అనౌన్స్ చేసినప్పటి నుంచి మళ్లీ సినిమాపై చర్చలు ఎక్కువైపోయాయి. సినిమకు సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వడం ప్రారంభించాయి.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్నో నెలల క్రితం సంగీత దర్శకుడు రవి బస్రూర్.. సలార్ సినిమా గురించి మాట్లాడిన వీడియో ఒకటి మళ్లీ ట్రెండింగ్ అవ్వడం ప్రారంభమైంది. ఆయన మాట్లాడుతూ.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రమ్‌కు.. సలార్ రీమేక్ అని అందులో ఆయన ఆయన చెప్పారు. వాస్తవానికి ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారో క్లారిటీ లేదు కానీ.. ఉగ్రం లైన్‌ను కంపేర్ చేసి చూస్తుంటే.. కొంత సారూప్యత కనిపిస్తోంది. కానీ ఎంత కాదనుకున్న మొత్తంగా మక్కికి మక్కి అయితే కచ్చితంగా కాదన్నది ఆఫ్ ది రికార్డ్ యూనిట్ అంటున్న మాట.
ఒకవేళ ఉగ్రం రీమేక్ అన్నదే నిజమనుకున్నా కూడా ఆల్రెడీ మళ్లీ అంత పెద్ద హిట్ అయినా ఉగ్రం సినిమానే .. మళ్లీ తీసి శాండల్ వుడ్ ప్రేక్షకులకు ఎందుకు ఇస్తాడనే బేసిక్ లాజిక్‌ను కూడా మనం మిస్ అవ్వకూడదు. పైగా ఉగ్రం ఇప్పటికే సోషల్ మీడియా యూట్యూబ్‌లో 50 మిలియన్ల వ్యూస్‌కు పైగా సాధించింది. అలాంటప్పుడు చూసిన కథనే మళ్లీ ప్రశాంత్ నీల్ ఎందుకు తీస్తాడనేది కూడా ఆలోచించుకోవాలి. ఈ విషయానికి సంబంధించి పూర్తి క్లారిటీ రావాలంటే సలార్ ప్రమోషన్లు మొదలై.. ప్రశాంత్ నీల్ నీరు విప్పేదాకా వేచి ఉండటమే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Prabhas Upcoming Movies : మరో రెండు కొత్త ప్రాజెక్ట్‌లకు ప్రభాస్ గ్నీన్ సిగ్నల్.. దర్శకులు ఎవరంటే?
Salaar Vs Dunki Clash : డైనోసార్ రాకకు డేట్ కన్ఫామ్.. ఇక ఈ చిత్రాలన్నీ తప్పుకోవాల్సిందే!