ETV Bharat / entertainment

'సలార్' టికెట్​ ధరల పెంపు- తెలంగాణలో మల్టీప్లెక్స్​కు రూ.100- ఏపీలో ఎంతంటే? - Salaar Tickets Rate in telangana

Salaar Tickets Rate : టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ లీడ్ రోల్​లో తెరకెక్కుతున్న 'సలార్' మూవీ డిసెంబర్​ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్​ ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతినిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంతకీ కొత్త ధరలు ఏలా ఉన్నాయంటే ?

Salaar Tickets Rate
Salaar Tickets Rate
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2023, 6:58 PM IST

Updated : Dec 19, 2023, 7:15 PM IST

Salaar Tickets Rate : రెబల్​ స్టార్ ప్రభాస్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'సలార్'కు తెలంగాణలో టికెట్ ధరలు పెరిగాయి. గతంలో టికెట్ ధరల పెంపు, బెనిఫిట్​ షో, ఎక్స్​ట్రా షోలకు అనుమతి ఇవ్వాలంటూ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. ఈ మేరకు ఆ దరఖాస్తును పరిశీలించిన హోంశాఖ అనుమతిని ఇస్తున్నట్లు ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేసింది.

ఇందులో భాగంగా మల్టీఫ్లెక్స్​లో గరిష్టంగా రూ. 100, సాధారణ థియేటర్లలో గరిష్టంగా రూ. 65 రూపాయలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు తాజా ప్రకటనలో పేర్కొంది. అయితే మొదటి వారం రోజులు మాత్రమే ఈ కొత్త ధరలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.

మరోవైపు తొలి రోజు రాష్ట్రంలోని 20 థియేటర్లలో మాత్రమే అర్థరాత్రి 1 గంటకు బెనిఫిట్​ షో కు అనుమతి ఇచ్చింది. సాధారణ షోస్​తో పాటు అదనంగా ఉదయం 4 గంటల నుంచి ఆరో ఆటను తెరపై చూపించేందుకు డిస్ట్రిబ్యూటర్లకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అటు ఆంధ్రప్రదేశ్​లోనూ టికెట్ ధరలు స్వల్పంగా పెంచుకునేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో 10 రోజులు మాత్రమే రూ. 40 రూపాయలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇటీవలే 'సలార్‌' సినిమా మొదటి టికెట్‌ను స్టార్​ డైరెక్టర్​ ఎస్ఎస్​ రాజమౌళి కొనుగోలు చేశారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లోని ఉదయం 7 గంటల షో టికెట్‌ను ఆయన కొన్నారని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మేకర్స్‌ ప్రకటించింది.

Salaar Movie Cast : ఇక సలార్ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంలో ప్రభాస్​ సరసన కోలీవుడ్ బ్యూటీ శ్రుతి హాసన్​ నటిస్తుండగా కీలక పాత్రల్లో పృథ్విరాజ్‍ సుకుమారన్​, బాబీ సింహా, జగపతిబాబు, టిన్నూ ఆనంద్, ఈశ్వరి రావు, శ్రియారెడ్డి, రామచంద్ర రాజు లాంటి స్టార్స్ నటించారు. ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

ఓవర్సీస్​లో ప్రభాస్ మేనియా- అడ్వాన్స్​ బుకింగ్స్​లో 'సలార్' జోరు- తొలి రోజు రూ.100 కోట్లు పక్కా!

'సలార్' 'కేజీఎఫ్‌' కనెక్షన్ - క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Last Updated : Dec 19, 2023, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.