ETV Bharat / entertainment

Salaar Teaser : వేటకొచ్చిన డైనోసార్.. ఫుల్​ కిక్కిచ్చేలా 'సలార్' టీజర్.. ప్రభాస్ ఎలివేషన్స్​ పీక్స్ - Jurassic Park

Salaar Teaser : ప్రభాస్‌ లీడ్​ రోల్​లో ప్రశాంత్ నీల్​ రూపొందించిన 'సలార్' మూవీ టీజర్​ రిలీజై సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. మీరు కూడా ఆ వీడియోను ఓ సారి లుక్కేయండి..

prabhas salaar movie
prabhas salaar movie teaser
author img

By

Published : Jul 6, 2023, 6:06 AM IST

Updated : Jul 6, 2023, 6:56 AM IST

Salaar Teaser : పాన్ఇండియా స్టార్​ ప్రభాస్‌ లీడ్​ రోల్​లో నటిస్తున్న సాలిడ్ యాక్షన్ మూవీ 'సలార్​'. 'కేజీయఫ్'​ సిరీస్​ లాంటి బ్లాక్​ బస్టర్​ను అందించిన స్టార్​ డైరెక్టర్​ ప్రశాంత్‌ నీల్‌ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ యాక్షన్‌ థ్రిలర్​కు సంబంధించిన టీజర్​ను 'ది మోస్ట్​ వైలెంట్​ మెన్.. ​ కాల్డ్​ వన్​ మెన్..​ ది మోస్ట్​ వైలెంట్​' పేరుతో చిత్ర యూనిట్​ తాజాగా విడుదల చేసింది. ఈ ప్రచార చిత్రం చూస్తుంటే 'కేజీయఫ్'​ను మించిపోయేలా ప్రభాస్‌కు ఓ రేంజ్​లో ఎలివేషన్ ఇచ్చినట్టు అర్థమవుతోంది. "సింపుల్ ఇంగ్లీష్‌.. నో క‌న్ఫ్యూజ‌న్‌... లయన్​, చీతా, టైగ‌ర్‌, ఎలిఫెంట్ వెరీ డేంజ‌ర‌స్‌.. బ‌ట్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్‌. బికాజ్ ఇన్ ద‌ట్ పార్క్.. దేర్ ఈజ్ ఏ..(సింహం.. చిరుత.. పులి.. ఏనుగు.. చాలా ప్రమాదం.. కానీ, జురాసిక్‌ పార్క్‌లో కాదు.. ఎందుకుంటే ఆ పార్కులో...) అంటూ సీనియర్ నటుడు టీనూ ఆనంద్‌ డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్‌ చూస్తుంటే.. ప్రభాస్‌ ఫ్యాన్స్​ కోరుకునే అన్ని మాస్‌ అంశాలను పుష్కలంగా పెట్టి సినిమాను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

అయితే ఈ డైలాగ్​ పూర్తవ్వకుండానే... ఆ తర్వాత పవర్‌ఫుల్ బీజేఎంతో ప్రభాస్‌ ఎంట్రీ చూపించడం గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ప్రచార చిత్రానికే అది హైలైట్​గా నిలిచింది. అంటే ఈ చిత్రంలో ప్ర‌భాస్ రోల్ ఎంత ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండ‌బోతుందో ఈ డైలాగ్​, ఎంట్రీతో డిఫ‌రెంట్‌గా చూపించారు నీల్​. అలా బ్లాక్ అండ్ వైట్ బ్యాక్‌గ్రౌండ్​లో కోల్​ మైనింగ్ ఏరియాలో ఉన్న ప్రభాస్​ విజువల్స్ అదిరిపోయాయి. ఆయన కత్తి పట్టుకుని విలన్లుపై విరుచుకుపడుతున్నట్టుగా చూపించారు. ఇదంతా చూస్తుంటే 'కేజీయఫ్'​ సినిమాను మించిపోయేలా 'సలార్‌'ను డిజైన్​ చేసినట్టు తెలుస్తోంది. ఇకపోతే శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ప్రచార చిత్రంలో 'సలార్ పార్ట్ 1 ceasefire' అని రాసుకొచ్చారు. సెప్టెంబరు 28న మొదటి భాగం రానున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ టీజర్​ చూసిన అభిమానులు, సినీప్రియులు.. టీజర్​ను సోషల్​మీడియాలో ట్రెండ్ చేస్తూ.. 'కేజీయఫ్​- 2' రికార్డుల‌ను 'స‌లార్' తిర‌గ‌రాయ‌డం ఖాయ‌మ‌ని అంచనాలు వేస్తున్నారు.

Salaar cast : ఇకపోతే 'బాహుబలి' తర్వాత వచ్చిన 'సాహో', 'రాధేశ్యామ్​', 'ఆదిపురుష్​' వంటి మూడు సినిమాలు ప్రభాస్ అభిమానులకు నిరాశ మిగిల్చాయి. కమర్షియల్​గా బాక్సాఫీస్​ ముందు వసూళ్ల మోత మోగించినా.. అవి పాజిటివ్​ మౌత్ టాక్​ను దక్కించుకోలేకపోయాయి. దీంతో ​ఫ్యాన్స్ అంతా 'సలార్' సినిమాపైనే భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇందులో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్​గా నటిస్తోంది. ఆమె ఆద్య అనే జర్నలిస్ట్​గా కనిపించనుందట. మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, సీనియర్ నటుడు జగపతి బాబు ప్రతినాయకులుగా కనిపిస్తున్నారు. ఇక శ్రియారెడ్డితో పాటు మరికొంతమంది ఇతర నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Jul 6, 2023, 6:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.