ETV Bharat / entertainment

'సలార్' బడ్జెట్ అన్ని కోట్లా! అందులో సగం యాక్టర్లకే- రెమ్యునరేషన్ ఎవరెవరికి ఎంతంటే? - సలార్​ అందరి రెమ్యునరేషన్​

Salaar Prabhas Remuneration : ప్రభాస్​ సలార్ మూవీ హిట్​ టాక్​తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ప్రభాస్​ రెమ్యునరేషన్​ ఎంత అని ఫ్యాన్స్​ నెట్టింట తెగ వెతికేస్తున్నారు. తాజాగా ఆ వివరాలు బయటకొచ్చాయి. మరి డార్లింగ్ రెమ్యునరేషన్​ ఎంతంటే?

Salaar Prabhas Remuneration
Salaar Prabhas Remuneration
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2023, 6:36 AM IST

Updated : Dec 23, 2023, 6:47 AM IST

Salaar Prabhas Remuneration : పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్- కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్​ కాంబోలో తెరకెక్కిన సలార్​ దెబ్బకు బాక్సాఫీస్ పునాదులు కదలడం పక్కా! సినిమాలో ప్రభాస్​ యాక్షన్​, ప్రశాంత్​ నీల్​ ఎలివేషన్లు, ఇంటర్వెల్ బ్యాంగ్​, క్లైమాక్స్​ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో తొలిరోజు వసూళ్లు భారీగా సాధించడం పక్కా అని అభిమానులు అంటున్నారు.

కేజీఎఫ్ రెండు పార్ట్​లతో సినీప్రియుల చూపు తనవైపు తిప్పుకున్న ప్రశాంత్​ నీల్​, ప్రభాస్​తో సినిమా అనౌన్స్​ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై హైప్​ మాములుగా లేదు. మధ్యలో వాయిదాల వల్ల ఫ్యాన్స్ కాస్త నిరాశపడిన అయిన మాట నిజమే. కానీ ఇప్పుడు థియేటర్లలోకి మూవీ వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయి సినిమాను ఫుల్​ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా పక్కనపెడితే ఈ సినిమా కోసం హీరో ప్రభాస్​తో పాటు మిగతా నటీనటులు తీసుకున్న రెమ్యునరేషన్​ హాట్​టాపిక్​గా మారింది.

అయితే స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్​ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్​ తన రెమ్యునరేషన్​ను కూడా ఒక్కసారిగా పెంచేశారట. సలార్​ మూవీకి రూ.100 కోట్ల పారితోషకం తీసుకున్నారట. అంతే కాకుండా సినిమా లాభాల్లో 10 శాతం షేర్​ తీసుకోనున్నట్లు సమాచారం.

ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు దాదాపు రూ.50 కోట్లు, హీరోయిన్ శ్రుతిహాసన్‌కు రూ.8 కోట్లు, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు చెరో రూ.4 కోట్ల రెమ్యునరేషన్​ అందుకున్నట్లు సమాచారం. మొత్తం మూవీ బడ్జెట్ రూ.400 కోట్ల వరకు ఉంటుందని టాక్. అంటే ఓవరాల్ బడ్జెట్‌లో సగం రెమ్యునరేషన్స్‌కే నిర్మాతలు ఖర్చు చేసినట్లు కనిపిస్తోంది!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సౌండ్ ఆఫ్​ సలార్ రిలీజ్​
మరోవైపు, సినిమా బ్లాక్ బస్టర్ హిట్​ అవ్వడంలో మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. కేజీఎఫ్​ రెండు పార్ట్​లకు మ్యూజిక్ అందించిన రవి బస్రూర్ ఈ మువీకి కూడా సంగీతం అందించారు. తాజాగా ఈ చిత్రం నుంటి సౌండ్​ ఆఫ్​ సలార్​ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో ఫ్యాన్స్​ను చాలా ఆకట్టుకుంటోంది. ప్రభాస్ టైటిల్ రోల్​లో నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్​లో శ్రుతి హాసన్ హీరోయిన్​గా నటించారు. పృథ్వీరాజ్ సుకుమారన్​, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరీ రావు తదితరలు కీలక పాత్రల్లో నటించారు.

పవన్​ ఆరేళ్ల రికార్డ్​ బ్రేక్- ప్రభాస్​​తో చొక్కా విప్పించిన ప్రశాంత్​ నీల్​!- థియేటర్లలో ఈలలే!!

'డంకీ' మీనింగ్​ అదేనట- షారుక్ క్లారిటీ​- మరి సలార్ అంటే ఏంటో తెలుసా?

Last Updated : Dec 23, 2023, 6:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.