ETV Bharat / entertainment

అక్కడ కూడా ప్రభాస్ టాప్​ - 'సలార్'​ డామినేషన్​ మాములుగా లేదుగా - సలార్ మూవీ అప్​డేట్స్

Salaar North America Box Office : 'సలార్​'తో బాక్సాఫీస్​ వద్ద సంచలనాలు క్రియేట్​ చేస్తున్నారు రెబల్​ స్టార్ ప్రభాస్​. ప్రస్తుతం ఈ సిినిమా అన్ని లోకేషన్స్​లో మాసిస్​ సక్సెస్​ అందుకుని కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే తాజాగా ఈ మూవీ నార్త్​ అమెరికాలో ఓ అరుదైన ఘనత అందుకుంది. ఇంతకీ అదేంటంటే ?

Salaar North America Box Office
Salaar North America Box Office
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 5:14 PM IST

Salaar North America Box Office : 'బాహుబలి'తో పాన్ ఇండియా లెవెల్​లో ఫ్యాన్​ ఫాలోయింగ్ పెంచుకున్న రెబల్ స్టార్ ప్రభాస్​, 'సలార్​'తో ఆ ఫాలోయింగ్ మరింత పెంచుకున్నారు. కథకు తన కటౌట్​ సరైందంటూ ఫ్యాన్స్ కొనియాడుతుండగా ప్రభాస్​ రేంజ్​ పాన్ వరల్డ్​ లెవెల్​కు పాకుతోంది. అలా మైండ్ బ్లోయింగ్ ఓపెనింగ్స్​తో బాక్సాఫీస్​ షేక్​ చేస్తున్న ప్రభాస్​ తొలి రోజు రూ. 180 కోట్లు, ఆ తర్వాతి రెండు రోజుల్లో రూ. 300 కోట్లు వసూళ్లు సాధించి మాసివ్ సక్సెస్​తో దూసుకెళ్తున్నారు.

మరోవైపు నార్త్ అమెరికాలో ప్రభాస్ మేనియా మాములుగా లేదు. ఇప్పటికే అక్కడి షోస్​ హౌస్​ఫుల్​గా కళకళలాడుతున్న వేళ ఈ సినిమా అక్కడి బాక్సాఫీస్ వద్ద ఏడు మిలియన్ డాలర్ల మార్కును దాటింది. అలా ఓ అరుదైన ఘనతను అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరోగా ప్రభాస్ చరిత్ర సృష్టించారు. ఇప్పటికే 'బాహుబలి 1', 'బాహుబలి పార్ట్​- 2'.. సాహో సినిమాలతో ఆయన ఈ ఘనతను సాధించగా, ఇప్పుడు ఈ క్లబ్​లోకి 'సలార్' ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగు నుంచి ప్రభాస్ సినిమాలు కాకుండా రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' మాత్రమే ఈ ఘనతను సాధించింది.

మరోవైపు ఓవరాల్​ టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్లలోనూ వరుస ఐదు స్థానాల్లో ప్రభాస్ సినిమాలు ఉన్నాయి. ఇది కూడా ఓ రికార్డే.తొలి రెండు స్థానాల్లో బాహుబలి- 2, బాహుబలి- 1 ఉన్నాయి. ఆ తర్వాత 'సలార్', 'సాహో', 'ఆదిపురుష్' మిగతా ఐదు స్థానాలను దక్కించుకున్నాయి.

Salaar Movie Cast : ఇక 'సలార్' సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంలో ప్రభాస్​ సరసన కోలీవుడ్ బ్యూటీ శ్రుతి హాసన్​ నటిస్తుండగా కీలక పాత్రల్లో పృథ్విరాజ్‍ సుకుమారన్​, బాబీ సింహా, జగపతిబాబు, టిన్నూ ఆనంద్, ఈశ్వరి రావు, శ్రియారెడ్డి, రామచంద్ర రాజు లాంటి స్టార్స్ నటించారు. ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

బాక్సాఫీస్ వద్ద 'సలార్' ప్రభంజనం- 4రోజుల్లోనే రూ.500కోట్లు వసూల్!

'సలార్'​కు ఓకే చెప్పింది అందుకే!- పార్ట్ 2 వేరే లెవల్​ : ప్రభాస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.