Salaar Teaser : ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించేందుకు పాన్ ఇండియా లెవెల్ మూవీ రిలీజ్ కానుంది. రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న 'సలార్' మూవీ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, బజ్‌తో ఈ సినిమాకు వేరె లెవల్లో హైప్ రాగా.. తాజాగా రిలీజైన టీజర్.. ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. దాదాపు ఒకటిన్నర నిమిషం నిడివిగల ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపింది. ఈ క్రమంలో అభిమానులు ఈ టీజర్‌లో వారికి కనిపించిన కొన్న ఆసక్తికర విషయాల గురించి నెట్టింట చర్చలు సాగిస్తున్నారు. ఆ విశేషాలు మీ కోసం..
సలార్‌లోకి 'రాకీ భాయ్' ఎంట్రీ..
Salaar KGF Connection : టీజర్‌లోని కొన్న అంశాలను నిశితంగా పరిశీలిస్తే.. ఈ సినిమాకు 'కేజీఎఫ్'కు కచ్చితంగా లింక్ కనిపిస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దీన్ని రుజువు చేసేందుకు ఫ్యాన్స్.. రెండు సినిమాలలోని కీ పాయింట్ తెలిపేలా ఓ రెండు ఫోటోలను జత చేసి నెట్టింట షేర్ చేస్తున్నారు. సలార్‌లో ఉన్న ఓ కంటైనర్ పై C-516 అని రాసుంది. సేమ్ ఇదే కంటైనర్ కేజీఎఫ్‌లోనూ కనిపించింది. దీంతో వీటి రెండిటికీ పక్కా కనెక్షన్ ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
-
Pic 1: #KGFChapter2 post credit scene
— ᴷᶦᶜᶜʰᵃ ⁴⁶ ₦𝖎ʂհ@ητђ™ ᵧₐₛₕ ₁₉ (@Nishanthks_54) July 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Pic 2: #SalaarTeaser
So #KGFxSALAAR confirmed #YashBOSS𓃵 #Prabhas #PrashanthNeel 🫡 pic.twitter.com/DqPIIlY42Y
">Pic 1: #KGFChapter2 post credit scene
— ᴷᶦᶜᶜʰᵃ ⁴⁶ ₦𝖎ʂհ@ητђ™ ᵧₐₛₕ ₁₉ (@Nishanthks_54) July 6, 2023
Pic 2: #SalaarTeaser
So #KGFxSALAAR confirmed #YashBOSS𓃵 #Prabhas #PrashanthNeel 🫡 pic.twitter.com/DqPIIlY42YPic 1: #KGFChapter2 post credit scene
— ᴷᶦᶜᶜʰᵃ ⁴⁶ ₦𝖎ʂհ@ητђ™ ᵧₐₛₕ ₁₉ (@Nishanthks_54) July 6, 2023
Pic 2: #SalaarTeaser
So #KGFxSALAAR confirmed #YashBOSS𓃵 #Prabhas #PrashanthNeel 🫡 pic.twitter.com/DqPIIlY42Y
ఎలివేషన్ సీన్స్ వేరెలెవెల్..
Salaar Entry Scene : 'కేజీయఫ్' సిరీస్లానే 'సలార్' టీజర్‌ని మేకర్స్ కట్ చేశారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. హీరో చేత ఒక్క డైలాగ్ కూడా చెప్పించనప్పటికీ.. అతని ఇంట్రడక్షన్ మాత్రం చాలా పవర్‌ఫుల్‌గా చూపించారు. అచ్చం ఇలాంటి వెర్షనే 'కేజీఎఫ్-2'లోనూ ఆడియెన్స్‌కు. అక్కడ 'హిస్టరీ టెల్స్ అజ్ ది పవర్‌ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రం పవర్‌పుల్ ప్లేసెస్. బట్ హిస్టరీ వాజ్ రాంగ్. పవర్‌ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ ఫుల్'అంటూ ఓ వ్యక్తి వాయిస్ ఓవర్‌తో హీరో పరిచయం ఉంటుంది. ఇప్పుడు 'సలార్' సినిమా కూడా అటువంటి ఇంగ్లీష్ డైలాగ్‌తోనే మొదలవుతుంది. 'లయన్, చీతా, టైగర్, ఎలిఫెంట్.. వెరీ డేంజరస్.. బట్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్, బికాజ్ ఇన్ దట్ పార్క్.. 'అంటూ హీరోని ఎలివేట్ చేస్తున్న డైలాగ్‌తో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'కేజీఎఫ్' సినిమా గోల్డ్ మైన్స్‌లో సాగితే.. 'సలార్' మూవీ బొగ్గు గనుల నేపథ్యంలో ఉంటుందని సమాచారం. 'కేజీఎఫ్' తరహాలోనే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రానుంది. ఇక పార్ట్ 1కు 'సీజ్ ఫైర్' అనే క్యాప్షన్‌ను ఇచ్చారు. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు కానీ, ఏదైనా హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు.. శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి 'సీజ్ ఫైర్'ను ఉపయోగిస్తారు. రెండో ప్రపంచ యుద్ధంలో మొదటిసారి ఈ పదాన్ని వాడారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'సలార్'లోకి కొత్త తాత..
'సలార్' టీజర్‌లో ప్రభాస్‌ను 10 సెకన్లకు మించి చూపించలేదు. దీంతో అభిమానులను కాస్త నిరాశ చెందారు. కానీ ఇదే టీజర్‌లో 'సలార్' ఎంట్రీకి ఎలివేషన్ ఇచ్చిన ఓ తాత మాత్రం టీజర్ మొత్తానికి బాగా హైలెట్ అయ్యాడు. అయితే ఈయన తెలుగు ప్రేక్షకులను బాగా సుపరిచితుడే. ఆయన పేరు అంతగా నోట్ కానప్పటికీ ఆయన్ను చూస్తే అభిమానులు ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఆయనే..బాలీవుడ్ స్టార్ టీనూ ఆనంద్. ఆదిత్య 369లో సైంటిస్ట్‌గా కనిపించిన ఈయనే.. అంజి సినిమాలోనూ విలన్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను భయపెట్టారు. ఆ తర్వాత సాహో సినిమాలో ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆయన.. గతేడాది వచ్చిన 'సీతారామం'లోనూ ఆనంద్ మెహతా అనే పాత్రలో కనిపించారు.