ETV Bharat / entertainment

'సలార్' 'కేజీఎఫ్‌' కనెక్షన్ - క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ - సలార్ ట్రైలర్

Salaar KGF Connection : 'సలార్' సినిమా గురించి డైెరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాకు 'కేజీఎఫ్‌'​కు కనెక్షన్​ ఉంటుందన్న వార్తలు నెట్టింట తెగ హల్​చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా ప్రమెషన్లలో భాగంగా​ నీల్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే ?

Salaar KGF Connection
Salaar KGF Connection
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2023, 2:54 PM IST

Updated : Dec 19, 2023, 4:19 PM IST

Salaar KGF Connection : రెబల్​ స్టార్ ప్రభాస్​, 'కేజీఎఫ్'​ ఫేమ్​ ప్రశాంత్​ నీల్ కాంబినేషన్​లో వచ్చిన సినిమా 'సలార్'. ఈ చిత్రం డిసెంబర్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది. వర్డల్​ వైడ్​గా ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్​తో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సోమవారం చిత్రబృందం విడుదల చేసిన సెకండ్​ ట్రైలర్​తో సినిమాపై అమాంతంగా అంచనాలు పెరిగాయి.

మరోవైపు ఈ సినిమాకు 'కేజీయెఫ్​'కు కనెక్షన్ ఉందంటూ పలు వార్తలు నెట్టింట హల్​ చల్​ చేశాయి. జులైలో విడుదలైన 'సలార్​' టీజర్​లోని కొన్ని సన్నివేశాలు చూసిన అభిమానులు అలానే అనుకున్నారు. 'కేజీఎఫ్​-2' క్లైమాక్స్​లో రాకీభాయ్​పై జరిగిన దాడి, 'సలార్'​ టీజర్​లో చూపించిన టైమ్​ రెండు ఒకటేనని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే మూవీ​ ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్​ ప్రశాంత్ నీల్ వీటిన్నంటిపై స్పందించారు. 'కేజీఎఫ్​తో సలార్​కు ఎలాంటి సంబంధం లేదు ఈ విషయాన్ని నేను ముందే చెప్పాల్సింది. ఇది నా తప్పే.' అని ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు.

అడ్వాన్స్ బుకింగ్​లో రికార్డ్​
భారీ అంచనాలు నెలకొన్ని ఈ మూవీ రిలీజ్​కు ముందే రికార్డులు బద్దలుకొడుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్​లో 'సలార్' రూ.21 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు సమాచారం. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు వసూలు చేయడం పక్కా అంటూ ఫ్యాన్స్ జోస్యం చెబుతున్నారు. అలానే 'కేజీఎఫ్'​ రికార్డును 'సలార్' బ్రేక్​ చేయాలని కోరుకుంటున్నారు.

'కేజీఎఫ్-2' ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.170 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే 'సలార్' మూవీపై ఉన్న హైప్ ను చూస్తుంటే ఈ రికార్డు బద్దలు కావడం పెద్ద కష్టం కాకపోవచ్చు అని మూవీ లవర్స్ అంటున్నారు. ఒకవేళ 'సలార్​' ఈ మార్క్​ను అందుకుంటే మాత్రం 2023లో హైయ్యెస్ట్​ గ్రాస్ అందుకున్న మూవీగా నిలిచిపోతుంది. మరి ఏమి అవుతుందో సినిమా విడుదలయ్యేంతవరకు వేచి చూడాల్సిందే.

Salaar Cast : కేజీఎఫ్, కాంతార వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్స్మ్ సలార్ మూవీని నిర్మించింది. సినిమాలో ప్రభాస్‌తో పాటు స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనాక్షి చౌదరి, ఈశ్వరి రావు, శరణ్ శక్తి తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఓవర్సీస్​లో ప్రభాస్ మేనియా- అడ్వాన్స్​ బుకింగ్స్​లో 'సలార్' జోరు- తొలి రోజు రూ.100 కోట్లు పక్కా!

వైలెంట్​గా 'సలార్' సెకండ్ ట్రైలర్- ప్రభాస్ డైలాగ్స్​కు గూస్​బంప్సే!

Last Updated : Dec 19, 2023, 4:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.