ETV Bharat / entertainment

బాక్సాఫీస్ వద్ద 'సలార్' ర్యాంపేజ్- 10 రోజుల్లో రూ.625 కోట్ల కలెక్షన్స్​​ - ఫ్యాన్స్​కు ప్రభాస్​ థ్యాంక్స్​ - సలార్ పదిరోజుల కలెక్షన్స్

Salaar day 10 Collection : బాక్సాఫీస్​ వద్ద సలార్ మూవీ రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.625 కోట్లు వసూలు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది.

Salaar day 10 Collection
Salaar day 10 Collection
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 1, 2024, 5:42 PM IST

Updated : Jan 1, 2024, 7:15 PM IST

Salaar day 10 Collection : పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ మువీ బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులను సృష్టిస్తోంది. వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 10 రోజుల్లో ప్రపంచవ్యప్తంగా (Salaar Collection Worldwide) ఈ సినిమా రూ.625 కోట్లు వసూలు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది.

Salaar Box Office Collection : సలార్​కు ఒక్క రోజు ముందు విడుదలైన 'డంకీ' సినిమా బాక్సాఫీసు ముందు అనుకున్న స్థాయిలో ప్రదర్శన చేయలేపోయింది. దీంతో సలార్ అడ్డు లేకుండా దూసుకెళ్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ మాస్ యాక్షన్​ కోసం ఫ్యాన్స్ రిపీట్ మోడ్​తో థియేటర్లకు వెళ్తున్నారు. మధ్యలో కలెక్షన్లు నెమ్మదించినా ఈ వీకెండ్​లో వసూళ్లు మళ్లీ పుంజుకున్నాయి. శనివారం ఈ సినిమా రూ.12.55 కోట్లు సాధించగా, ఆదివారం రూ.15.74 కోట్లు రాబట్టిందని సినీ ట్రేడ్​ వర్గాల సమాచారం. శనివారంతో పోల్చితే ఆదివారం పదోరోజు 25.42 శాతం ఎక్కువ వసూళ్లు రాబట్టిందని తెలుస్తోంది. ఫలితంగా భారత్​లో ఈ సినిమా రూ.346.88 కోట్లు సాధించింది. ఈ సినిమా రిలీజ్​ రోజు రూ.178.7 కోట్లు కలెక్షన్లు రాబట్టిందని అంతకుముందు చిత్ర బృందం తెలిపింది. దీంతో 2023లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.

అభిమానులకు ప్రభాస్​ థాంక్స్
Prabhas New Year : సినిమాను పెద్ద హిట్​ చేసిన అభిమానులకు ప్రభాస్​ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్​లో రెండు పార్టులుగా తెరకెక్కిన 'సలార్ పార్ట్-1 సీజ్​ఫైర్' డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఖాన్సార్ అనే ఒక అండర్ వరల్డ్ సిటీ సింహాసనం కోసం మూడు ట్రైబల్ ఫ్యామిలీస్ మధ్య జరిగే యుద్ధం నేపథ్యంతో ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్, ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రీయా రెడ్డి కీలక పాత్రలు పోషించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'సినిమాలు క్రికెట్‌ మ్యాచులా ? - 'సలార్​' సోలోగా రిలీజ్​ అయ్యుంటే ఇలాంటివి వచ్చేది కాదు'

'తెలుగు స్టేట్స్​లో ప్రభాస్​ ఇమేజ్ చాలు- అక్కడ 'సలార్' ప్రమోషన్స్ పెంచాల్సింది!'

Last Updated : Jan 1, 2024, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.