Sai Pallavi Yash Movie : సహజ నటనతో దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయిపల్లవి. డాక్టర్ విద్యనభ్యసించిన ఈ చిన్నది.. నటనపై ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మలయాళ మూవీ 'ప్రేమమ్' ద్వారా తెరంగేట్రం చేసి.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల ఫిదా చేసింది. ఈ సినిమాలోని ఒక్క సీన్ వల్ల 'మలర్ మిస్'గా పాపులరైపోయింది. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్‌తో 'కలి' అనే సినిమాలో మెరిసింది. దీంతో ఈ అమ్మడికి ఆఫర్ల వెల్లువ మొదలయ్యాయి. అయితే వరుస అవకాశాలు వచ్చినా ఆచితూచి అడుగేసింది. అలా 'ఫిదా'తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చితెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. చివరగా 2022లో వచ్చిన తమిళ చిత్రం 'గార్గి' తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సాయిపల్లవి, ప్రస్తుతం తమిళంలో హీరో శివకార్తికేయన్‌తో ఓ సినిమాలో నటిస్తోంది. తెలుగులో నాగచైతన్యతో 'తండేల్'లో లీడ్ రోల్లో నటిస్తోంది.
Sai Pallavi Upcoming Project : ఇప్పటివరకు తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో నటించింది సాయిపల్లవి. అయితే ఈ అమ్మడు గురించి ఇప్పుడు ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ నేచురల్ బ్యూటీ సాండల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు 'కేజీఎఫ్' ఫేమ్ హీరో యశ్‌తో ఓ సినిమాలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సోమవారం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు యశ్. డిసెంబర్ 8న సినిమా టైటిల్ ప్రకటించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 8న సినిమా టైటిల్ ప్రకటించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 8న ఉదయం 09:55 గంటలకు 'యశ్ 19' టైటిల్‌ను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సాయి పల్లవి ఈ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేస్తుందని సినీ వర్గాల టాక్. కాగా ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది.
-
It’s time… 8th December, 9:55 AM.
— Yash (@TheNameIsYash) December 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Stay tuned to @KvnProductions #Yash19 pic.twitter.com/stZYBspuxY
">It’s time… 8th December, 9:55 AM.
— Yash (@TheNameIsYash) December 4, 2023
Stay tuned to @KvnProductions #Yash19 pic.twitter.com/stZYBspuxYIt’s time… 8th December, 9:55 AM.
— Yash (@TheNameIsYash) December 4, 2023
Stay tuned to @KvnProductions #Yash19 pic.twitter.com/stZYBspuxY
యూకే వెళ్లేందుకు తిప్పలు - 25 ఏళ్ల తర్వాత రివెంజ్ - ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న 'డంకీ' ట్రైలర్