ETV Bharat / entertainment

'ఆ ప్లేస్​ అంటే నాకు చాలా ఇష్టం.. కానీ ఎందుకో చెప్పలేను!' - saipallavi

Sai Pallavi Favourite Place: తారలు ఖాళీ సమయాల్ని గడిపేందుకు ఒక్కొక్కరు ఒక్కో ప్రదేశాన్ని ఇష్టపడుతుంటారు. ఆ విషయంలో వాళ్లదైన అభిరుచి ప్రతిబింబిస్తుంటుంది. అలా హీరోయిన్​ సాయిపల్లవి ఆటవిడుపుగా తరచూ వెళ్లే ప్రదేశం గురించి చెప్పుకొచ్చింది. ఆమెకు బీచ్​ అంటే చాలా ఇష్టమట.

sai pallavi favourite place
sai pallavi favourite place
author img

By

Published : Aug 1, 2022, 8:15 AM IST

Sai Pallavi Favourite Place: మలయాళంలో 'ప్రేమమ్' సినిమాతో సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేసిన అందాల భామ సాయి పల్లవి. ఈ మూవీలో మలర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత 'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో తెలంగాణ అమ్మాయి భానుమతి పాత్రలో అదరగొట్టింది.

sai pallavi favourite place
సాయి పల్లవి

ఫిదా సూపర్ హిట్ తర్వాత తెలుగులో ఎన్నో ఆఫర్స్ వచ్చినప్పటికీ..స్క్రిప్ట్, పాత్ర ప్రాధాన్యాన్ని బట్టి సినిమాలకు ఓకే చెప్పింది. అలా 'మిడిల్ క్లాస్ అబ్బాయి', 'కణం', 'పడి పడి లేచే మనసు', 'లవ్ స్టోరీ', 'శ్యామ్ సింగరాయ్','విరాటపర్వం', 'గార్గి' సినిమాలతో అలరించింది. నటన పరంగా సినీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న సాయి పల్లవిని అభిమానులు ముద్దుగా 'లేడీ పవర్ స్టార్' అని పిలుచుకుంటారు. అయితే సాయి పల్లవి ఇష్టాలను, అభిరుచిలను తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తుంటారు అభిమానులు.

sai pallavi favourite place
సాయి పల్లవి

ఇటీవల సాయి పల్లవి తనకు ఇష్టమైన ప్రదేశం గురించి చెప్పుకొచ్చింది. తనకు సముద్ర తీరం అంటే చాలా ఇష్టమని.. ఖాళీ సమయం దొరికితే ఎక్కువగా బీచ్​కు వెళ్లేందుకు ఇష్టపడతానని చెప్పింది. అయితే సముద్రతీరం అంటే ఎందుకంత ఇష్టమనేది తాను చెప్పలేనంది. 'అలా నిలబడి సముద్రాన్ని చూస్తూ ఉంటే ఆ అనుభూతి వర్ణించలేనిది.. ధ్యానం చేసినట్టుగానే ఉంటుంది. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది' అని తెలిపింది.

sai pallavi favourite place
సాయి పల్లవి

అలాగే బీచ్ తర్వాత ఎక్కువగా ఇష్టమైన పని పుస్తకాలు చదవడం అని.. సినిమా స్క్రిప్ట్​ను కూడా ఓ పుస్తకంలా భావిస్తూ చదువుతుంటానని చెప్పుకొచ్చింది. సాయి పల్లవి ఇటీవలే 'గార్గి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో తప్పుడు కేసులో చిక్కుకున్న తండ్రిని కాపాడుకునే కుమార్తె పాత్రలో అద్భుతంగా నటించింది.

ఇవీ చదవండి: 'కశ్మీరీ సింగర్'​ పాత్రలో కంగనా.. ప్రొఫెసర్‌ విశ్వామిత్రగా మోహన్​బాబు

రాకెట్రీకి రజిని ఫిదా.. మాధవన్‌, నంబి నారాయణన్‌కు సత్కారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.