ETV Bharat / entertainment

RRR Collections: రాజమౌళి మ్యాజిక్​.. ఏడు రోజులు.. రూ.710 కోట్లు!

RRR Movie 1st week Collections Worldwide: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్​' విజయవంతంగా మొదటి వారాన్ని పూర్తి చేసుకుంది. చరణ్​, ఎన్టీఆర్​ కాంబోలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్​ వద్ద కనక వర్షం కురిపిస్తోంది. పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడం వల్ల మంచి కలెక్షన్లను రాబడుతోంది. అయితే మొదటి వారంలో ఈ సినిమా కలెక్షన్లు ఎంత? లాభాల బాట పట్టిందా?

RRR Collections
ఆర్​ఆర్​ఆర్​ మొదటి వారం వసూళ్లు
author img

By

Published : Apr 1, 2022, 6:02 PM IST

రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన 'ఆర్​ఆర్​ఆర్​'.. బాక్సాఫీస్​ను కొల్లగొడుతోంది. మార్చి 25న రిలీజైన ఈ సినిమా మొదటి వారాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఏడురోజులు పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.710 కోట్లు గ్రాస్​ సాధించింది. కేవలం హిందీలోనే రూ.132 కోట్ల (గ్రాస్) మార్కును దాటినట్లు ట్రేడ్​ వర్గాలు చెబుతున్నాయి.

ఆర్​ఆర్​ఆర్​ 6వ రోజు కాస్త అంచనాలు తప్పినా.. 7వ రోజు మాత్రం తిరిగి పుంజుకుంది. కర్ణాటక, తమిళనాడులో సైతం మంచి వసూళ్లతోనే మొదటి వారాన్ని ముగించింది. కేరళలో స్టైక్​ వల్ల నాలుగో రోజు, ఐదో రోజు కలెక్షన్లపై ప్రభావం పడింది. అయితే ఆరు, ఏడో రోజు కలెక్షన్లు పర్వాలేదనిపించాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్​ఆర్​ఆర్​ మొదటి వారం వసూళ్లు షేర్లు ఇలా ఉన్నాయి..

  • నైజా- రూ. 77.22 కోట్లు
  • సీడెడ్​- రూ. 37.28కోట్లు
  • యూఏ-రూ. 20.97కోట్లు
  • ఈస్ట్​ గోదావరి- రూ. 11.16కోట్లు
  • వెస్ట్​ గోదావరి- రూ. 9.76కోట్లు
  • గుంటూరు- రూ. 14.03కోట్లు
  • కృష్ణ- రూ.10.78కోట్లు
  • నెల్లూరు- రూ.6.45కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం- రూ. 187.65కోట్లు షేర్​ ( రూ.279.50 కోట్ల గ్రాస్​)

  • కర్ణాటక- రూ.27.75కోట్లు
  • తమిళనాడు- రూ.25.30కోట్లు
  • కేరళ-రూ.8.00కోట్లు
  • హిందీ- రూ.65.60కోట్లు
  • రెస్ట్​ ఆఫ్​ ఇండియా-రూ. 5.10కోట్లు
  • ఓవర్సీస్​- రూ.73.45కోట్లు

ప్రపంచవ్యాప్తంగా మొత్తం- రూ.392.85కోట్లు షేర్​ (గ్రాస్​- 710కోట్లు)

ఆర్​ఆర్​ఆర్​ సినిమాను రూ.451 కోట్లకు అమ్మగా.. రూ.453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్​తో బరిలోకి దిగింది. అయితే మొదటి వారంలో రూ.392 కోట్ల షేర్​ కొల్లగొట్టింది. మొదటి వారం తర్వాత బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇంకా 60.15 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్​ఆర్​ఆర్​ ఈ వీకెండ్ లో కాస్త జోరు చూపెట్టినా బ్రేక్ ఈవెన్​ను దాటి.. లాభాల బాట పడుతుంది.

ఇవీ చూడండి: సుకుమార్‌ దర్శకత్వంలో మెగాస్టార్‌.. ఫొటో షేర్‌ చేసిన చిరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.