Ram charan G20 Summit : 'ఆర్‌ఆర్‌ఆర్'తో సినిమాతో టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి తండోపతండాలుగా ఫ్యాన్స్ తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుతున్నారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ బిజీలో ఉన్న ఆయన.. శ్రీ నగర్లో జరుగుతున్న జీ20 సదస్సుకు భారతీయ సినిమా పరిశ్రమకు ప్రతినిధిగా హాజరయ్యారు. ఇక ఆ సదస్సులో రామ్ చరణ్ స్పీచ్‌కు అభిమానులే కాదు భారతీయులంతా ఫిదా అవుతున్నారు. ఆయనపై నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు.
Ram Charan Hollywood Debut : ''ఇండియాలో ఎంతో అందమైన ప్రాంతాలు ఉన్నాయి. కశ్మీర్ లాంటి ప్లేస్‌లో ఈ సదస్సు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. భారత్‌లో కేరళ, కశ్మీర్.. ఇలా ఎన్నో ప్రాంతాల్లో ప్రకృతి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇలాంటి లోకేషన్లు షూటింగ్‌లకు ఎంతో బాగుంటాయి. నేను వీటన్నింటినీ ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాను. అందుకే నేను ఇకపై నటించనున్న సినిమాల షూటింగ్ ఎక్కువ శాతం ఇండియాలోనే జరపాలని కోరుకుంటున్నాను. కేవలం లోకేషన్ల కోసం ఇతర దేశాలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంటున్నాను. నేను హాలీవుడ్ సినిమాల్లో నటించినా.. ఆ దర్శకులకు కూడా ఇండియా అందాలు చూపిస్తాను. వాళ్లనే ఇక్కడికి రమ్మని షరతు పెడతాను. నార్త్, సౌత్ అని రెండు రకాల సినిమాలు లేవు. ఉన్నది భారతీయ సినిమా ఒక్కటే. ఇప్పుడు అదే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందింది'' అని అన్నారు.
-
• @AlwaysRamCharan Hinted the Sneak in of Hollywood Project in his Lined up Movies. If Everything Falls in Place 💥💥💥🤞#G20Summit #RamCharanForG20Summit pic.twitter.com/WPvxfAy8Fi
— Trends RamCharan™ (@TweetRamCharan) May 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">• @AlwaysRamCharan Hinted the Sneak in of Hollywood Project in his Lined up Movies. If Everything Falls in Place 💥💥💥🤞#G20Summit #RamCharanForG20Summit pic.twitter.com/WPvxfAy8Fi
— Trends RamCharan™ (@TweetRamCharan) May 22, 2023• @AlwaysRamCharan Hinted the Sneak in of Hollywood Project in his Lined up Movies. If Everything Falls in Place 💥💥💥🤞#G20Summit #RamCharanForG20Summit pic.twitter.com/WPvxfAy8Fi
— Trends RamCharan™ (@TweetRamCharan) May 22, 2023
జపాన్ ఎంతో ప్రత్యేకం..
''నా సినీ కెరీర్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. జపాన్‌లో ఆ సినిమాను ఎంతగానో ఆదరించారు. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లినప్పుడు అక్కడ ప్రజల మాతో ఎంతో ఆత్మీయంగా ఉన్నారు. వాళ్ల ప్రేమాభిమానాలకు మేమంతా ఆశ్చర్చపోయాం. ఇక జపాన్ నాకు, నా భార్యకు కూడా చాలా ప్రత్యేకమైనది. ప్రస్తుతం నా భార్యకు ఏడో నెల. తనని ఇప్పుడు జపాన్ టూర్ వెళ్దామని అడిగినా వెంటనే ఓకే అంటుంది'' అని రామ్ చరణ్ తెలిపారు.
ఆయనే మాకు స్ఫూర్తి..
ఇక ఈ ఇంటర్వ్యూలో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడిన రామ్ చరణ్ ఆయనే తనకు స్ఫూర్తి అన్నారు. ''నా చిన్నప్పుడు మా నాన్నతో కలిసి షూటింగ్ చూడటానికి కశ్మీర్‌కు మొదటిసారి వచ్చాను. అప్పటి నుంచి ఎన్నోసార్లు ఇక్కడకు వచ్చాను. ఇప్పుడు ఇలా ఈ సదస్సులో పాల్గొనడానికి రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మా నాన్నకు 68 ఏళ్లు. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటున్నారు. అంత గొప్ప హీరో అయినా కూడా ఉదయాన్నే 5.30కు నిద్రలేచి పనిలో మునిగిపోతారు. ఆయనకు సినిమాలపై ఉన్న నిబద్ధత అలాంటిది. ఆయన్ని చూసి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను'' అని చెప్పారు.