ETV Bharat / entertainment

కొనసాగుతున్న ఆర్​ఆర్​ఆర్​ అవార్డుల పరంపర.. ఏకంగా ఐదు నామినేషన్లు..!

author img

By

Published : Dec 15, 2022, 2:07 PM IST

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్'​ అవార్డుల పరంపర కొనసాగిస్తోంది. తాజాగా ఈ సినిమా 'క్రిటిక్​ ఛాయిస్​ అవార్డు'ల్లో ఐదు క్యాటగిరీల్లో నామినేషన్లు సాధించింది.

rrr for critic choice nominations
ఆర్​ఆర్​ఆర్​ అవార్డులు

దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం.. అవార్డుల పరంపర కొనసాగిస్తోంది. ఇటీవల సాటర్న్​ అవార్డ్స్​తో పాటు పలు అంతర్జాతీయ అవార్డ్స్​లో సత్తా చాటిన ఆర్ఆర్​ఆర్​కు ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. 'క్రిటిక్​ ఛాయిస్​ అవార్డ్స్​'లో ఐదు క్యాటగిరీల్లో నామినేషన్లు సాధించింది. ఆ క్యాటగిరీలు.. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ విజువల్​ ఎఫెక్ట్స్​, ఉత్తమ విదేశీ భాష చిత్రం, ఉత్తమ సాంగ్(నాటు నాటు.. పాట).
'క్రిటిక్​ ఛాయిస్​ అసోషియేషన్'​ అనేది.. అమెరికా, కెనడాలో సినీ మీడియా రంగంలో అతిపెద్ద అసోషియేషన్​. దీనికి దాదాపు 600 మంది సినీ జర్నలిస్టులు, ఫిల్మ్​ క్రిటిక్​లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సంవత్సరం సినీ విమర్శకులు ఏ సినిమా ఇష్టపడ్డారో అనేదానికి ఈ అవార్డు ఒక నిదర్శనం. దీంతో 'ఆర్​ఆర్​ఆర్' ఆస్కార్​ ఆశలు మరింత పెరిగిపోతున్నాయి.
'ఆర్ఆర్ఆర్' అంటే అంతే మరి...
ప్రముఖ సినీ రచయిత విజేంద్ర ప్రసాద్​ ఆర్​ఆర్​ఆర్​ సినిమాకు కథను అందించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రెండు పవర్​ఫుల్​ క్యారక్టర్లు.. కొమురం భీం, అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్​, రామ్​ చరణ్​లకు అద్భుంతాగం చూపించారు. భారత్​లో అఖండ విజయం సాధించింది ఈ సినిమా.. అంతర్జాతీయ స్థాయిలోనూ అదరగొట్టింది. అలియా భట్​, అజయ్​ దేవ్​గన్​, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్​, రే స్టీవెన్​ సన్, అలిసన్ డూడీ లాంటి నటులు ప్రముఖ పాత్రలు పోషించిన ఈ సినిమా.. అస్కార్​ బరిలో ఉత్తమ విదేశీ చిత్రం క్యాటగిరీలో పోటీపడుతోంది. అయితే భారత్ ​నుంచి 'ఆర్ఆర్​ఆర్'​కు అస్కార్​కు ఎంట్రీ లేకపోయినా.. ప్రవేటుగా పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాగా, శాటర్న్​ అవార్డ్స్, న్యూయార్క్​ క్రిటిక్​ అవార్డ్స్, అట్లాంటా ఫిల్మ్​ క్రిటిక్ సర్కిల్​, బోస్టన్​ సోసైటీ ఆఫ్​ ఫిల్మ్​ క్రిటిక్స్​ అవార్డ్స్​.. లాంటి అనేక అవార్డుల్లో నామినేషన్లు సాధించి అవార్డులు సొంతం చేసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.