ETV Bharat / entertainment

2023లో టాలీవుడ్​ హీరోల సందడి- బాక్సాఫీసు వద్ద ఎవరి మెరుపు ఎంత?

Round Up 2023 Tollywood Box Office : కొన్ని సీజన్లలో టాలీవుడ్​ అగ్ర కథానాయకులు తెలుగు ప్రేక్షకులను అలరించారు. మిగతా ఏడాదంతా చిన్న, మీడియం రేంజ్​ స్టార్లు బాక్సాఫీసు ముందు సందడి చేశారు. అయితే అందులో కొంతమందికి ఈ ఏడాది కలిసివచ్చింది. మరికొందరికి చేదు ఫలితాలను ఇచ్చింది. ఏ హీరోకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో తెలుసుకుందాం.

Round Up 2023 Tollywood Box Office
Round Up 2023 Tollywood Box Office
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2023, 7:10 AM IST

Updated : Dec 12, 2023, 8:36 AM IST

Round Up 2023 Tollywood Box Office : ఈ ఏడాది టాలీవుడ్ అగ్ర హీరోలు పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. అయితే అది కొన్ని సీజన్లకు మాత్రమే పరిమితమైంది. మిగతా సంవత్సరమంతా బాక్సాఫీసును నడిపించింది చిన్న, మీడియం రేంజ్‌ హీరోల చిత్రాలే. 2023లో వీరి ఆధిపత్యమే బలంగా కనిపించింది. ఒకరిద్దరు మినహా ఈ ఏడాది యంగ్​ హీరోలంతా వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. అందులో కొందరు హిట్ కొట్టారు. మరికొందరిని ఫలితాలు నిరాశపరిచాయి. ఎవరికి ఎలాంటి ఫలితాలు ఎదురయ్యాయంటే?

నేచురల్​ స్టార్​కు విజయాలు..!
నేచురల్​ స్టార్​ నాని కొత్త ట్యాలెంట్​ను ప్రోత్సహిస్తూ కొత్తదనం నిండిన కథలతో థియేటర్లలో సందడి చేయడానికి ముందుంటారు. ఈ ఏడాది ఆయనకు బాగా కలిసొచ్చింది. నాని 2023 ఆరంభంలో 'దసరా'తో బాక్సాఫీసు ముందు మెరుపులు మెరిపించారు. ఇక ఇటీవల 'హాయ్‌ నాన్న'తో మరో విజయం సాధించారు. ఈ జోష్‌లోనే 'సరిపోదా శనివారం'తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. వివేక్‌ ఆత్రేయ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది.

ప్రయోగాల హీరోకు మిశ్రమ ఫలితం!
ప్రయోగాలు చేయడంలో ముందుండే యంగ్​ హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం వల్ల గతేడాది ఒక్క చిత్రం కూడా విడుదల చేయలేకపోయారు. కానీ, ఈ ఏడాది ఆయన రెండు చిత్రాలతో బాక్సాఫీస్‌ ముందు జోరు చూపించారు. అందులో వేసవి బరిలో నిలిచిన 'విరూపాక్ష' ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆయన తన మేనమామ పవన్‌ కల్యాణ్‌తో కలిసి చేసిన 'బ్రో' సినిమా మెగా అభిమానుల్ని మెప్పించింది. అయానా ఓవరాల్​గా మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. తేజ్‌ ప్రస్తుతం సంపత్‌ నంది దర్శకత్వంలో 'గాంజా శంకర్‌' అనే చిత్రంలో నటిస్తున్నారు.

నాగచైతన్యకు ఈ ఏడాది 'కస్టడీ' రూపంలో చేదు ఫలితం దక్కింది. కానీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'దూత' వెబ్‌ సిరీస్‌ అభిమానులను థ్రిల్ చేసింది. ఈ విజయోత్సాహంలో దర్శకుడు చందూ మొండేటితో కలిసి 'తండేల్‌' చిత్రాన్ని పట్టాలెక్కించారు చైతూ. ఇది 2024లో థియేటర్లలోకి రానున్నట్లు సమాచారం.

అర్జున్​ రెడ్డి ఫేమ్​ విజయ్​ దేవరకొండ గతేడాది 'లైగర్‌'తో బాక్సాఫీస్‌ ముందు నిరాశపరిచారు. కానీ ఈ సంవత్సరం 'ఖుషి'తో ఫర్వాలేదనిపించుకున్నారు. విజయ్​, సమంత కాంబినేషన్​లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు మంచి వసూళ్లే రాబట్టింది. విజయ్‌ ప్రస్తుతం పరశురామ్‌ డైరెక్షన్​లో 'ఫ్యామిలీస్టార్‌' సినిమాలో నటిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది.

నవీన్​ మంచి మార్కులు.. నవ్వించిన 'సామజవరగమన'!
యువ సంచలనం నవీన్​ పొలిశెట్టి 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతిరత్నాలు' సినిమాలతో వరుస విజయాలందుకొని సత్తా చాటారు. ఈ ఏడాది ఆయన అనుష్కతో కలిసి 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి' చిత్రంతో థియేటర్లలో సందడి చేశారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే వేశారు. వైవిధ్యభరితమైన కథలతో వినోదాలు పంచడంలో కథానాయకుడు శ్రీవిష్ణు ముందుంటారు. ఆయన 2023 'సామజవరగమన'తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి విజయం సాధించారు. ఇక 'ఆర్‌ఎక్స్‌ 100' తర్వాత సరైన విజయాలు లేక సతమతమవుతున్న యువ హీరో కార్తికేయకు ఈ ఏడాది 'బెదురులంక 2012'తో మంచి ఫలితం దక్కింది.

మీడియం స్టార్లకు కలిసిరాని 2023!
చిన్న, మీడియం రేంజ్‌ స్టార్లలో 2023 చాలా మందికి కలిసి రాలేదు. గోపీచంద్‌, నితిన్‌, కల్యాణ్‌రామ్‌, నాగశౌర్య, వరుణ్‌ తేజ్‌ ఇలా అనేక మంది మీడియం రేంజ్‌ స్టార్లకు చేదు ఫలితాలు దక్కాయి. గతేడాది 'బింబిసార'తో హిట్టు కొట్టిన కల్యాణ్‌ రామ్‌ ఈ ఏడాది ఆరంభంలో 'అమిగోస్‌'తో చేదు ఫలితాన్ని అందుకున్నారు. దీంతో ఇప్పుడాయన విజయమే లక్ష్యంగా 'డెవిల్‌'తో అలరించేందుకు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. స్పై థ్రిల్లర్ జానర్​లో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 29న థియేటర్లలోకి రానుంది.

గోపీచంద్​కు చేదు ఫలితం!
గత కొన్నాళ్లుగా సరైన విజయాలు లేక సతమతమవుతున్న గోపీచంద్‌కు ఈ ఏడాది చేదు ఫలితాన్ని మిగిల్చింది. మంచి అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన 'రామబాణం' సినీ ప్రియుల మెప్పు పొందలేకపోయింది. వేసవి బరిలో 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'తో బాక్సాఫీస్‌ ముందు బోల్తా కొట్టిన నాగశౌర్య సెకండ్ హాఫ్​లో 'రంగబలి'తో మరో ఫ్లాప్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఇక ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ 'స్కంద'తో మిశ్రమ ఫలితాన్ని అందుకున్నారు. యంగ్ హీరోలు నిఖిల్‌ 'స్పై'తో, అఖిల్‌ 'ఏజెంట్‌'తో, సందీప్‌ కిషన్‌ 'మైఖేల్‌'తో, విష్వక్‌ సేన్‌ 'దాస్‌ కా దమ్కీ'తో, వైష్ణవ్‌ తేజ్‌ 'ఆదికేశవ'తో, సుధీర్‌బాబు 'హంట్‌', 'మామామశ్చీంద్ర'లతో ప్రేక్షకుల్ని నిరాశపరిచారు.

నిరాశపరిచిన నాలుగు సినిమాలు!
కిరణ్‌ అబ్బవరం ఏడాది ఆరంభంలో 'వినరో భాగ్యము విష్ణుకథ'తో మంచి ఫలితం దక్కించుకున్నారు. అయినా ఆ తర్వాత వచ్చిన 'మీటర్‌', 'రూల్స్‌ రంజన్‌' సినిమాలు నిరాశపరిచాయి. ఇక సంతోష్‌ శోభన్‌ నుంచి ఈ ఏడాది 'కళ్యాణం కమనీయం', 'శ్రీదేవి శోభన్‌బాబు', 'అన్నీ మంచి శకునములే', 'ప్రేమ్‌కుమార్‌' ఇలా వరుసగా నాలుగు చిత్రాలొచ్చాయి. అయినప్పటికీ ఏదీ ఆశించిన ఫలితాన్ని అలరించలేకపోయింది.

ఆ లిస్ట్​ టాప్​లో కియారా- ఆరోస్థానంలో సిద్ధార్ధ్- క్రేజీ కపుల్​ ఛాన్స్ కొట్టేశారుగా!

ఏడాదిలో నానికి రెండో హిట్- ఈ హీరో సక్సెస్ ఫార్ములా ఇదే!

Last Updated : Dec 12, 2023, 8:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.