ETV Bharat / entertainment

యశ్​ నెక్ట్స్​ మూవీ అనౌన్స్​కు ప్లాన్​.. దర్శకుడు అతడే.. హీరోయిన్​ ఎవరంటే? - director narthan

కేజీయఫ్​ 2 దేశవ్యాప్తంగా క్రేజ్​ సంపాదించుకున్న రాకింగ్​ స్టార్​ యశ్​ నెక్ట్స్​ సినిమా అనౌన్స్​మెంట్​పై సోషల్​మీడియాలో ప్రచారం సాగుతోంది. దర్శకుడు నార్తన్​తో ఓ భారీ ప్రాజెక్ట్​ చేయబోతున్నారని, ఇందులో హీరోయిన్​గా పూజాహెగ్డేను తీసుకోవాలని భావిస్తున్నారట. త్వరలోనే అధికార ప్రకటన చేయనున్నారని సినీవర్గాల టాక్​.

hero yash new movie
హీరో యశ్​ కొత్త సినిమా
author img

By

Published : Jul 10, 2022, 10:39 AM IST

Hero Yash new movie: 'కేజీయఫ్​ 2' తర్వాత హీరో యశ్​ చేయబోయే సినిమాపై దేశవ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ కేజీయఫ్​ రెండో భాగం​ విడుదలై నెలలు గడుస్తున్నా ఆయన నుంచి ఇంకా ఎటువంటి సినిమా ప్రకటన రాలేదు. దీంతో ఆయన నెక్ట్స్​ ఏ దర్శకుడితో చేయనున్నారు? ఎలాంటి ప్రాజెక్ట్​ను ప్రకటించనున్నారు? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ క్రమంలోనే యశ్​.. తన తదుపరి చిత్రాన్ని కన్నడ దర్శకుడు నార్తన్​తో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 'కేజీయఫ్ 2' కన్నా ముందుగానే దీనికే గ్రీన్​సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పాన్​ ఇండియా స్థాయిలో ఆయనకు ఉన్న ఇమేజ్​ను దృష్టిలో పెట్టుకుని నార్తన్​ ఏడాదిన్నర నుంచి ఓ పవర్​ఫుల్​ స్క్రిప్ట్​ను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వర్క్​ తుది దశకు చేరుకున్నట్లు తెలిసింది. ఇటీవలే యశ్​ను కలిసి దర్శకుడు తాను సిద్ధం చేసిన కథను వినిపించినట్లు తెలిసింది. కథతో పాటు తన క్యారెక్టరైజేషన్​ నచ్చడం వల్ల ఆయన ఓకే చేసినట్లు చెబుతున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్​మెంట్​ రాబోతున్నట్లు ప్రస్తుతం ప్రచారం సాగుతోంది. ట్విటర్​లో 'యశ్​ 19', 'యశ్ ది బాస్'​ అనే హ్యాష్​ట్యాగ్​ ట్రెండ్​ అవుతున్నాయి. ఇందులో హీరయిన్​గా పూజాహెగ్డే నటించనుందట.

కాగా, ప్రశాంత్​ నీల్​ దర్శకత్వలో యశ్​ హీరోగా రూపొందిన 'కేజీయఫ్​ 2' ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. దాదాపు 1200 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. దీంతో యశ్ కోసం వివిధ భాషలకు చెందిన అగ్ర దర్శకులు కథలను సిద్ధం చేస్తున్నారు. అతడి డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇదీ చూడండి: ఆరోగ్యంపై హీరో విక్రమ్​ వీడియో మెసేజ్​.. ఏమన్నారంటే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.