ETV Bharat / entertainment

RRR gay controversy: ' మీరు ఇంత దిగజారడం బాధగా ఉంది'.. రసూల్​కు శోభు యార్లగడ్డ కౌంటర్​.. - shobu yarlagadda respond Resul Pookutty comments

'ఆర్​ఆర్​ఆర్' సినిమాపై అస్కార్​ గ్రహీత.. రసూల్​ పూకుట్టి చేసిన సంచలన వ్యాఖ్యలపై 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. 'మీ లాటి స్థాయి ఉన్న వాళ్లు ఇంత దిగజారడం బాధగా ఉంది' అంటూ.. గట్టి కౌంటర్​ ఇచ్చారు.

Resul Pookutty calls 'RRR' 'gay love story', 'Baahubali' producer Shobu Yarlagadda criticises
' మీరు ఇంత దిగజారడం బాధగా ఉంది'.. రసూల్​ పూకుట్టి శోభు యార్లగడ్డ కౌంటర్​..
author img

By

Published : Jul 5, 2022, 3:42 PM IST

Updated : Jul 5, 2022, 10:38 PM IST

ఎన్టీఆర్, రామ్ చరణ్​తో రాజమౌళి సృష్టించిన సంచలనం ఆర్​ఆర్​ఆర్​. అయితే ఈ సినిమాపై ఆర్జీవీ నుంచి మొదలైన అనుచిత వ్యాఖ్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 'ఆర్​ఆర్​ఆర్'పై సౌండ్ ఇంజనీర్​, ప్రఖ్యాత అస్కార్​ గ్రహీత.. రసూల్​ పూకుట్టి తన అక్కసును వెల్లగక్కారు. అయితే రసూల్​ పూకుట్టి వ్యాఖ్యలపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ గట్టి కౌంటర్​ ఇచ్చారు. నాకు ఆ సినిమా అలా అనిపించలేదని, ఒక వేళ అయితే తప్పేంటని తనదైన శైలిలో స్పందించారు.

  • I don't think @RRRMovie is a gay love story as you say but even if it was, is "gay love story" a bad thing? How can you justify using this ? Extremely disappointed that someone of your accomplishments can stoop so low! https://t.co/c5FmDjVYu9

    — Shobu Yarlagadda (@Shobu_) July 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఆర్ఆర్ఆర్ సినిమా నాకు గే స్టోరీలా అనిపించలేదు. ఒకవేళ అది గే స్టోరీ అయితే తప్పేంటి? అందులో చెడ్డ విషయం ఏముంది? మీ వ్యాఖ్యలను ఎలా సమర్థించుకోగలరు? మీ లాటి స్థాయి ఉన్న వాళ్లు ఇంత దిగజారడం బాధగా ఉంది"

-శోభు యార్లగడ్డ, బాహుబలి నిర్మాత

రసూల్​ పూకుట్టి అసలు ఏం అన్నారు?

'ఆర్​ఆర్​ఆర్' సినిమా 'గే లవ్​ స్టోరీ' అంటూ రసూల్​ పూకుట్టి ట్విట్టర్​లో ఆదివారం కామెంట్​ చేశారు. అయితే దీనిపై 'ఆర్​ఆర్​ఆర్'​ అభిమానులు రసూల్​ పూకుట్టిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'నిన్న రాత్రి ఆర్​ఆర్​ఆర్​ అనే చెత్త సినిమా 30నిమిషాలు చూశా' అని నటుడు, రచయిత మునీష్ భరద్వాజ్.. ఆదివారం ట్వీట్​ చేశారు. దీనికి స్పందించిన రసూల్​ పూకుట్టి 'గే లవ్​ స్టోరీ' రీ ట్వీట్​ చేశారు. ఆలియా భట్​ను ఆసరాగా ఉయోగించుకున్నారని, అమెకు ఎలాంటి ప్రాధాన్యం లేదని మరో ట్వీట్​లో చెప్పుకొచ్చారు. దీనిపై రాజమౌళి, ఎన్టీఆర్​, రామ్​చరణ్ అభిమానులు కోపంగా రియాక్ట్​ అవుతున్నారు. 'ఆస్కార్ స్థాయి వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేస్తారని అనుకోలేదు' అని ఒక నెటిజన్​ కామెంట్​ పెట్టాడు. తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడాన్ని జీర్ణించుకోలేకే.. ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Yes I merely quoted something that was already in the public domain… no offense meant… https://t.co/cT1Exlq8PT

    — resul pookutty (@resulp) July 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కామెంట్ల రూపంలో విమర్శలు వెల్లువెత్తడం వల్ల రసూల్​ పూకుట్టి మరోసారి ట్విట్టర్​ వేదికగా స్పందించారు. అయితే తనంతట తాను అనలేదని, పబ్లిక్​ డొమైన్​లో ఉన్నదే చెప్పానంటూ.. మరింత రెచ్చగొట్టేలా పోస్ట్​ పెట్టారు. 1920 నాటి కథాంశంతో అల్లూరి సీతారామ రాజు, కొమ‌రం భీమ్ నేపథ్యంతో ఈ కథను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్ల వసూళ్లను రాబట్టింది.

ఇదీ చదవండి: DJ Tillu: ఏమైంది రాధికా.. సీక్వెల్​లో​ ఉండవా?

Last Updated : Jul 5, 2022, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.